For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎక్కడి నుంచి ఎక్కడికి - సెమీ ఫైనల్స్‌లో పాకిస్తాన్ గ్రాండ్ ఎంట్రీ..!!

Pakistan defeat Bangladesh by 5 wickets and qualify for the semifinals of this T20 World Cup 2022

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12 ముగింపు రోజు మరో సంచలనం చోటు చేసుకుంది. సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా కన్‌ఫర్మ్ చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగించింది. సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలను చేజేతులారా పోగొట్టుకుంది. సూపర్ 12 దశలోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసిపోయింది. తన చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో మట్టి కరిచింది దక్షిణాఫ్రికా. అత్యంత అవమానకరంగా టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది.

దక్షిణాఫ్రికాకు చుక్కలు..

దక్షిణాఫ్రికాకు చుక్కలు..

ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆడిన తీరు - ఓ అద్భుతం. తనకంటే ఎంతో బలమైన దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించింది. పరాజయాన్ని చవి చూపించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆ తరువాత బౌలింగ్‌లో నెదర్లాండ్స్ ప్లేయర్లు చూపించిన తెగువ, దూకుడు ముందు దక్షిణాఫ్రికా వెలవెలబోయిన తీరు చూసి తీరాల్సిందే. దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో దాని స్థానంలో పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు చేరింది.

 అయిదు వికెట్ల తేడాతో..

అయిదు వికెట్ల తేడాతో..

అడిలైడ్ ఓవల్‌లో తన చివరి సూపర్ 12 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది పాకిస్తాన్. అయిదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లల్లో అయిదు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ విజయంతో సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. నిజానికి- ఇది దక్షిణాఫ్రికా స్థానం. నెదర్లాండ్స్ చేతిలో దారుణంగా ఓడిపోవడం వల్ల సెమీస్ చేరే అవకాశాలను బంగారు పళ్లెంలో పెట్టి పాకిస్తాన్‌కు అప్పగించినట్టయింది.

తక్కువ స్కోరుకే..

తక్కువ స్కోరుకే..

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్- నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో మినహా మరెవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. 48 బంతుల్లో ఏడు ఫోర్లతో 54 పరుగులు చేశాడు శాంటో. డాషింగ్ ఓపెనర్ లిట్టన్ దాస్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. భారీ స్కోర్ అందుకోలేకపోయాడు. 10 పరుగులకే షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో షాన్ మసూద్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

తడబడ్డ బ్యాటింగ్ ఆర్డర్..

తడబడ్డ బ్యాటింగ్ ఆర్డర్..

సౌమ్యా సర్కార్ - 20, అఫీఫ్ హొస్సేన్ - 24, మొసాద్దెక్ హొస్సేన్ - 5, నూరుల్ హసన్ - 0, తస్కిన్ అహ్మద్ -1, నాసుమ్ అహ్మద్- 7 పరుగులు చేశారు. కేప్టెన్ షకీబుల్ హసన్‌ది గోల్డెన్ డక్. షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ఎల్బీడబ్ల్యూగా బలి అయ్యాడు. వివాదాస్పదమైన ఎల్బీడబ్ల్యూ ఇది. దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌పై.

నాలుగు వికెట్లతో..

నాలుగు వికెట్లతో..

పాకిస్తాన్ ఏస్ బౌలర్ షహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి నలుగురు బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. లిట్టన్ దాస్, మొసాద్దెక్ హొస్సేన్‌ను నూరుల్ హసన్, తస్కిన్ అహ్మద్‌ను అవుట్ చేశాడు. షాదబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. హ్యారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్ ఒక్కో వికెట్‌ను నేలకూల్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

రాణించిన బాబర్..

రాణించిన బాబర్..

128 పరుగుల లక్ష్యంతో క్రీజ్‌లోకి దిగిన పాకిస్తాన్- శుభారంభం చేసింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్- మహ్మద్ రిజ్వాన్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి వికెట్ నష్టానికి 57 పరుగులు జోడించారు. బాబర్ ఆజమ్- 25, మహ్మద్ రిజ్వాన్- 32 పరుగులు చేశారు. ఆ తరువాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. లక్ష్యం భారీగా లేకపోవడం వల్ల పాకిస్తాన్ బ్యాటర్లు పెద్దగా ఆందోళన చెందలేదు. మహ్మద్ నవాజ్-4, ఇఫ్తికర్ అహ్మద్- 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. మహ్మద్ హ్యారిస్- 31, షాన్ మసూద్- 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Story first published: Sunday, November 6, 2022, 13:28 [IST]
Other articles published on Nov 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+