హైదరాబాద్: బౌలర్ వేసే బంతిని సరిగ్గా అంచానా వేయక పోవడం వల్ల మైదానంలో యువ క్రికెటర్ మృత్యువాత పడ్డాడు. పాకిస్తాన్‌కు చెందిన జుబైర్ అహ్మద్ మర్దాన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ విసిరిన బౌన్సర్ అతని తలను బలంగా తాకింది.
దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆగస్టు 14న జరిగింది. ఈ విషాయన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన ట్వట్టర్ ద్వారా వెల్లడించింది. జుబైర్ మరణం ఆటగాళ్లకు భద్రత ముఖ్యమనే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోందని వ్యాఖ్యానించింది.

ఎల్లవేళలా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ, మృతుడి కుటుంబానికి సంతాపాన్ని తెలిపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మార్డన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో జుబైర్ క్వెట్టా బియర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. క్వెట్టా బియర్స్ జట్టు తరఫున నాలుగు లిస్ట్ ఎ, టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
కొన్నేళ్ల క్రితం దేశవాళీ టోర్నీలో ఆడుతూ ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్, ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బంతి తగిలి మృతి చెందిన సంగతి తెలిసిందే.