Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి మ్యాచ్ ఆడకుండానే.. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన షోయబ్ మాలిక్

ICC Cricket World Cup 2019 : Shoaib Malik Announces Retirement From ODI Cricket || Oneindia Telugu
ICC Cricket World Cup 2019, Pakistan vs Bangladesh: Pakistan Cricketer Shoaib Malik announces ODI retirement


పాకిస్తాన్‌ సీనియర్ క్రికెటర్, భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ శుక్రవారం అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మాలిక్ తన రిటైర్మెంట్ అంశాన్ని అధికారిక ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. అయితే మాలిక్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ (చివరి మ్యాచ్) ఆడకుండానే వన్డేల నుంచి తప్పుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రిటైర్‌ అవుతున్నా:

రిటైర్మెంట్‌పై ట్విట్టర్ వేదికగా షోయబ్ మాలిక్ స్పందిస్తూ... 'ఈ రోజు అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి రిటైర్‌ అవుతున్నా. నాతో ఆడిన ఆటగాళ్లకు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా, స్పాన్సరర్స్ కు ధన్యవాదాలు. ముఖ్యంగా నా అభిమానులకు కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్' అని మాలిక్ రాసుకొచ్చారు. మాలిక్‌కు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఇస్తున్న వీడియోను క్రికెట్ ప్రపంచకప్ తన అధికారిక ట్విట్టర్ కూడా షేర్ చేసింది.

ఈ ప్రపంచకప్‌లో 8 పరుగులే:

ఈ ప్రపంచకప్‌లో 8 పరుగులే:

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాడుగా ఇంతకాలం షోయబ్ మాలిక్ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ గడ్డపై అతడి సేవలు జట్టుకు ఉపయోగపడుతాయని పాక్ యాజమాన్యం అతన్ని సెలెక్ట్ చేసింది. అయితే అంచనాలను తలక్రిందులు చేస్తూ ప్రపంచకప్ టోర్నీలో ఘోరంగా విఫలమై జట్టులోనే చోటు కోల్పోయాడు. ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లే ఆడిన మాలిక్.. 8, 0, 0 పరుగులు చేశాడు. దీంతో అతన్ని పక్కనపెట్టేశారు. ఒక మ్యాచ్‌లో అయితే వికెట్లను బ్యాట్‌తో కొట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక టీమిండియాపై డకౌట్ అయ్యాడు.

ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ అవసరం లేదు:

షోయబ్‌ మాలిక్‌కు ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ అవసరం లేదని పాక్ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. 'పాక్‌కు మాలిక్‌ సేవలు అమోఘం. అయితే రిటైరయ్యే ప్రతి ఆటగాడికీ ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఇవ్వడానికి ఇది క్లబ్‌ క్రికెట్‌ కాదు. అతనికి ఓ మంచి డిన్నర్‌ ఇస్తే చాలు' అని అక్రమ్‌ అన్నాడు. తన కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌తో ఆడుదామనుకున్న మాలిక్‌కు నిరాశే ఎదురైంది.

వెస్టిండీస్‌పై ఆరంగేట్రం:

వెస్టిండీస్‌పై ఆరంగేట్రం:

1999లో వెస్టిండీస్‌పై తొలి వన్డే ఆడిన మాలిక్‌.. చివరి వన్డే టీమిండియాపై ఆడాడు. 20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 143. 9 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు చేసాడు. ఇక 39.19 సగటుతో 158 వికెట్లు కూడా పడగొట్టాడు. 2010లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. మాలిక్, సానియాలకు ఓ కుమారుడు ఉన్నాడు.

Story first published: Saturday, July 6, 2019, 9:02 [IST]
Other articles published on Jul 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+