For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్

Mohammad Amir Announces Retirement From Test Cricket || Oneindia Telugu
Pakistan Cricketer Mohammad Amir announces retirement from Test cricket

హైదరాబాద్: పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది. 2009, జులైలో గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమీర్ పాక్ తరుపున మొత్తం 36 టెస్టులాడాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

17 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన ఆమీర్ 30.47 యావరేజితో మొత్తం 119 వికెట్లు తీశాడు. 2017, ఏప్రిల్‌లో కింగ్‌స్టన్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన టెస్టులో ఆమీర్(6/44) కెరీర్ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఆమీర్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా ఆమీర్ మాట్లాడుతూ "సుదీర్ఘ ఫార్మాట్‌లో పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం చాలా గౌరవంగా ఉంది. వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారించడం కోసం సంప్రదాయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. పాకిస్థాన్ జట్టుకు ఆడాలన్నదే నా అంతిమ కోరిక, లక్ష్యం. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో సహా జట్టు రాబోయే సవాళ్లకు తోడ్పడటానికి ఉత్తమమైన శారీరక ఆకృతిలో ఉండటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను" అని వెల్లడించాడు.

2010లో స్ఫాట్ ఫిక్సింగ్‌లో ప్రమేయం

2010లో స్ఫాట్ ఫిక్సింగ్‌లో ప్రమేయం

పాక్ టెస్టు జట్టులో పేసర్‌గా చోటు దక్కించుకున్న మహ్మద్ ఆమీర్‌పై 2010లో స్ఫాట్ ఫిక్సింగ్‌లో ప్రమేయం ఉందని తేలడంతో ఐదేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆమీర్ కేసులో మినహాయింపు ఇవ్వడంతో పాటు తిరిగి జాతీయ జట్టులో చోటు కల్పించింది.

లార్డ్స్‌లో పునరాగమనం

లార్డ్స్‌లో పునరాగమనం

అంతర్జాతీయ క్రికెట్‌లోకి మహ్మద్ ఆమీర్ పునరాగమనం తిరిగి లార్డ్స్‌లోనే జరిగింది. యాదృచ్చికమో ఏమో తెలియదు గానీ ఇదే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో అతను తన కెప్టెన్ సల్మాన్ బట్, మరో పేసర్ మహ్మద్ ఆసిఫ్‌లతో స్పాట్ ఫిక్సింగ్‌లో ప్రేమేయం ఉన్నందుకు గాను దోషిగా తేలాడు.

36 టెస్టుల్లో 22 టెస్టులు

36 టెస్టుల్లో 22 టెస్టులు

తన కెరీర్‌లో ఆడిన 36 టెస్టుల్లో 22 టెస్టులు 2016లో పునరాగనమం చేసిన తర్వాత ఆడినవే కావడం విశేషం. ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని ఆమీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ మాట్లాడుతూ

మహ్మద్ ఆమీర్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ కొనియాడాడు. "ఈ మధ్య కాలంలో టెస్టు క్రికెట్‌ చూసిన ఎడమచేతివాటం బౌలర్లలో అద్భుత ప్రతిభ కలిగిన బౌలర్లలో ఆమీర్ ఒకడు. యువ క్రికెటర్‌గా కష్టాలను అధిగమించి చాలా స్ట్రాంగ్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి పునరాగమం చేశాడు. మైదానంలో అతడి స్కిల్, డ్రెస్సింగ్ రూమ్‌లో అతడి పర్సనాలిటీని సుదీర్ఘ ఫార్మాట్‌ మిస్సవుతుంది" అని అన్నాడు.

Story first published: Friday, July 26, 2019, 16:40 [IST]
Other articles published on Jul 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+