For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారతీయ యువతిని పెళ్లాడనున్న పాకిస్థాన్ క్రికెటర్

Pakistan cricketer Hasan Ali to tie the knot with an Indian girl in Dubai

హైదరాబాద్: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అయితే, హసన్ అలీ పెళ్లాడబోయే అమ్మాయి భారత యువతి కావడం విశేషం. ఆమె పేరు షర్మిల ఆర్జో. హర్యానాలోని మేత్వా జిల్లాకు చెందిన షర్మిలను హసన్ అలీ ఆగస్టు 20న వివాహమాడనున్నట్లు తెలుస్తోంది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

దుబాయిలోని అట్లాంటిస్ పామ్ హోటల్‌లో జరగనున్న ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి విషయమై షర్మిత్ తండ్రి లియాఖత్ అలీ మాట్లాడుతూ ఆగస్టు 17న పది మంది కుటుంబ సభ్యులతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయల్దేరి వెళ్లనున్నట్లు తెలిపారు.

షర్మిల మనవ్ రచన యూనివర్సిటీ నుంచి బీటెక్(ఏరోనాటికల్) విభాగంలో పట్టా పొందారు. ఆమె మాజీ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని కూడా. ఇక, షర్మిల తండ్రి లియాఖత్ అలీ హర్యానాలో బ్లాక్ డెవలప్‌మెంట్ అండ్ పంజాయత్ ఆపీసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అయితే, పాక్ క్రికెటర్లు భారత యువతిని పెళ్లాడటం ఇదే మొదటిసారి కాదు.

గతంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు భారత యువతిని పెళ్లాడిన వారి జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్, హసన్ ఖాన్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

Story first published: Tuesday, July 30, 2019, 18:08 [IST]
Other articles published on Jul 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+