11మంది మృతి: సెకండ్ ఫ్లోర్ నుంచి దూకిన పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్: కరాచీలోని ఓ స్టార్ హోటల్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో అత్యధిక శాతం మంది విదేశీయులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో పాకిస్థాన్ బౌలర్ యాసిమ్ ముర్తాజా చీల మండకు తీవ్ర గాయమైంది. వివరాల్లోకి వెళితే కరాచీలోని రీజెంట్ ప్లాజా హోటల్‌లో సోమవారం ఉదయం హోటల్ గ్రౌండ్ ఫోర్‌లో ఉన్న వంట గదిలో తొలుత మంటలు వ్యాపించి అవి హోటల్ మొత్తాన్ని చుట్టుముట్టాయి.

హోటల్ రెండో అంతస్తు నుంచి దూకాడు
కయిద్-ఇ-అజం ట్రోఫీలో భాగంగా యునైటెడ్ బ్యాంక్ ప్లేయర్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్ అయిన యాసిమ్ ముర్తాజా అక్కడే బస చేస్తున్నారు. అయితే ప్రమాద సమాచారం తెలుసుకున్న బౌలర్ యాసిమ్ ముర్తాజా తప్పించుకునే యత్నంలో హోటల్ రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు.

చీలిమండకు గాయం
దాంతో అతని చీలిమండకు తీవ్రమైన గాయమైంది. యుబీఎల్ మేనేజర్ నదీమ్ ఖాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అతడికి ఎలాంటి ప్రమాదం లేదని క్షేమంగానే ఉన్నాడని తెలిపారు. మరొక క్రికెటర్ కరామాత్ అలీ చేతికి గాయపడినట్లు తెలిపారు.

ప్రమాదం నుంచి తప్పించుకున్న క్రికెటర్ షోయబ్ మస్జూద్
అంతర్జాతీయ క్రికెటర్ షోయబ్ మస్జూద్ ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. జట్టులోని మిగతా ఆటగాళ్లంతా క్షేమంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. పోగ కారణంగా ఊపిరి ఆడకపోవడంతో వారికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ప్రజలు ఆందోళన
మరోవైపు పాకిస్థాన్‌లో ఈ తరహా అగ్నిప్రమాదాలు తరచూ చోటు చేసుకోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతులను కరాచీలోని జిన్నా ఆసుపత్రికి తరలించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications