హైదరాబాద్: సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడిన తాజా క్రికెటర్‌గా పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ గుర్తింపు పొందాడు. గతంలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు క్రికెటర్లను నెజిటన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. వర్క్అవుట్ చేసిన అనంతరం దిగిన ఫోటోని తన ట్విట్టర్లో పోస్టు చేయడమే దీనికి కారణం.
ఈ ఫోటోలో చెమటలు కక్కుతున్న అహ్మద్ కారులో విశ్రాంతి తీసుకుంటూ తన భార్య సనతో మంచి వర్క్అవుట్ చేసిన అనంతరం ఫీలింగ్ ఎలా ఉంటుందంటే! అని కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు అహ్మద్ షెజాద్‌ను డ్రామా క్వీన్, సెల్ఫీ క్వీన్‌గా అభివర్ణిస్తూ మండిపడ్డారు.

ఇక అహ్మద్ షెజాద్ విషయానికి వస్తే ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. దీంతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన నీకు ఇంత అవసరమా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
'ఈ విషయాన్ని నీ భార్య అడిగిందా?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, మరో నెటిజన్ 'ఇక నువ్వు జీవితంలో తిరిగి జట్టులో ఆడవు' అని రీట్వీట్ చేశాడు. మరికొందరు ఇది క్రికెట్‌లో రియల్‌గా చేసి చూపించు అని కామెంట్స్ పోస్టు చేశారు.