Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3 నెలలు నిషేధం!: డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలిన పాకిస్థాన్ క్రికెటర్

Pakistan cricketer Ahmed Shehzad fails dope test after consuming marijuana: Reports

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ రెండోసారి డోపింగ్ పరీక్షలో దోషిగా తేలాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా నిర్వహించిన డోప్ పరీక్షలోనూ అతను మళ్లీ పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది.

దీంతో అతను కనీసం మూడు నెలల పాటు నిషేధం ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనూ షెహజాద్ డోపింగ్‌లో దొరికాడు. దీంతో గతంలో అతడికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. పాకిస్థాన్‌లో జరిగిన దేశవాళీ వన్డే టోర్నీ పాకిస్థానీ కప్ ఆడే సమయంలో అతనికి డోప్ పరీక్షలు నిర్వహించారు.

ఆ పరీక్షల్లో అతడు పాజిటివ్‌గా తేలాడు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగిన ఈ టోర్నీలో అతడు మొత్తం 372 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. ఓ క్రికెట‌ర్‌ డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలినట్లు పాక్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. 26 ఏళ్ల అహ్మద్ షెహజాద్ ఇటీవలే స్కాట్లాండ్‌తో ముగిసిన రెండు టీ20ల సిరిస్‌లో ఆడాడు.

Story first published: Thursday, June 21, 2018, 14:11 [IST]
Other articles published on Jun 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+