Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కత్రినా కైఫ్ అంటే ఇష్టం: పాక్ కెప్టెన్

Pakistan cricket team captain Sarfraz Ahmed wants to a play a Dabangg-like role opposite Katrina Kaif

హైదరాబాద్: బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ అన్నాడు. తాజాగా, ఓ ఇంటర్యూలో పాల్గొన్న సర్ఫరాజ్ అహ్మద్ పలు ఆసక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఇందులో ఇష్టమైన బాలీవుడ్‌ నటి ఎవరన్న ప్రశ్నకు గాను కత్రినా కైఫ్‌ అని బదులిచ్చాడు. అవకాశమొస్తే ఆమెతో కలిసి నటిస్తానని కూడా చెప్పాడు. బాలీవుడ్‌ సినిమా దబాంగ్‌లో సల్మాన్‌ఖాన్‌ నటించిన పాత్ర లాంటి ఆఫర్‌ వస్తే కత్రినాతో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు.

బాలీవుడ్‌ సినిమాలు బాగా చూస్తానని, సల్మాన్‌ ఖాన్‌-కత్రినా కైఫ్‌ జంటగా నటించిన సినిమాలన్ని చూశానని చెప్పుకొచ్చాడు. సర్ఫరాజ్‌ కెప్టెన్సీలో పాక్ జట్టు త్వరలో ఆసియా కప్‌లో ఆడనుంది. సెప్టెంబరు 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభంకానుంది.

ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబరు 19న భారత్‌-పాక్‌ జట్లు తలపడనున్నాయి. గతేడాది ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాపై పాకిస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, August 23, 2018, 19:31 [IST]
Other articles published on Aug 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+