Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్సీ తొలగించాక అలా ఆడటం చాలా కష్టం.. కోహ్లీపై పాక్ దిగ్గజాల ప్రశంసలు

Pakistan cricket legends praise Virat Kohli for his energy

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మూడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చెయ్యక విపరీతంగా విమర్శలపాలైన అతను.. ఆసియా కప్‌తో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. దాన్ని ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో కొనసాగిస్తున్నాడు. అలాగే భారత్ తరఫున అత్యుత్తమ ఫీల్డర్లలో కూడా కోహ్లీ ఒకడు. మైదానంలో చురుకుగా కదులుతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడం కోహ్లీ ప్రత్యేకత. ఈ క్రమంలోనే పాకిస్తాన్ దిగ్గజాలు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్.. కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు.

కెప్టెన్సీ వివాదం..

కెప్టెన్సీ వివాదం..

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన భారత్.. గ్రూప్ దశలోనే ఆ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అనంతరం పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో టీ20, వన్డేల్లో జట్టు సారధ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అందించింది. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకున్నాడు.

జట్టు కోసం తపన..

జట్టు కోసం తపన..

కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత కూడా కోహ్లీ నూటికి నూరు శాతం జట్టు కోసం తపించడాన్ని పాక్ మాజీ సారధి, లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ కొనియాడాడు. కెప్టెన్సీ నుంచి అలా తొలగిస్తే ఎవరైనా నిరాశ చెందుతారని, కానీ కోహ్లీ దాన్ని కూడా అధిగమించాడని మెచ్చుకున్నాడు. 'నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించారు అని మొఖం వేలాడేసుకొని షార్ట్ ఫైన్ లెగ్‌లో నిలబడతా అని కోహ్లీ అనలేదు. ఒక బ్యాటర్‌గా, భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్‌లా ఆడతానన్నాడు' అని అక్రమ్ చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత కూడా కోహ్లీ ఇంటెన్సిటీలో ఎలాంటి మార్పూ రాలేదన్నాడు.

పాక్‌లో అలా జరగదు..

పాక్‌లో అలా జరగదు..

వసీం అక్రమ్‌తోపాటు అప్పట్లో పాక్ బౌలింగ్ భారాన్ని మోసిన వకార్ యూనిస్ కూడా కోహ్లీని మెచ్చుకున్నాడు. పాకిస్తాన్‌లో ఎవరినైనా కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పిస్తే.. ఆ ఆటగాడు కనీసం ఆడే 11 మందిలో చోటు సంపాదించుకోలేరని చెప్పాడు. 'పాక్‌లో కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ఇక ఇంటికి వెళ్లిపోవడమే. సారధ్య బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన పాక్ ఆటగాళ్లెవరూ నాకు గుర్తులేరు' అని తేల్చేశాడు.

ఇదే విషయంపై మాట్లాడిన వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ కూడా కోహ్లీ ఆటతీరును మెచ్చుకున్నాడు. కోహ్లీ ఎప్పుడూ టీ20 మ్యాచులను 40 ఓవర్ల ఆటలా ఆడతాడని, తొలి బంతి నుంచి చివరి బంతి వరకు అదే ఉత్సాహంతో ఉంటాడని అన్నాడు. పాక్‌లో మంచి స్కోర్ చేసిన ఆటగాళ్లు కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటారని, కానీ కోహ్లీ పరుగులు చేసినా చెయ్యకపోయినా.. మొత్తం 40 ఓవర్లలో ఏదో క్షణంలో మ్యాచ్‌ను మలుపుతిప్పేందుకు సిద్ధంగా అదే ఇంటెన్సిటీతో ఆడతాడని ప్రశంసించాడు.

Story first published: Sunday, November 6, 2022, 15:23 [IST]
Other articles published on Nov 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+