పాకిస్తానోళ్లు మొక్కుకున్నారా?.. తిట్టుకున్నారా..?

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఆదివారం భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ ఆరంభానికి ముందు- కొన్ని ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటూ శతృదేశం పాకిస్తానీయులు కూడా దర్గాల చుట్టూ చక్కర్లు కొట్టారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి అనుగుణంగా ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో కూడా అరకొరగా కనిపించిన పాకిస్తాన్ గ్రీన్ ఆర్మీ క్రికెట్ జట్టు అభిమానులు టీమిండియాకు మద్దతుగా నిలిచిన సందర్భాలు కనిపించాయి. వారి దువాల సంగతి ఎలా ఉన్నా- మ్యాచ్ మాత్రం చేజారిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవడం వల్ల మూడు జట్లకు సెమీఫైనల్‌కు వెళ్లే దారులు మూసుకుపోయినట్టే. అందులో పాకిస్తానూ ఒకటి.
మొక్కుకున్నారా? తిట్టుకున్నారా?
పాకిస్తాన్‌ను కూడా కలుపుకొని చూస్తే.. మొత్తం అఖండ భారతావని ఈ మ్యాచ్‌ను గెలవాలని కోరుకుంది. ప్రతి పాకిస్తానీయుడు కూడా ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని ఆశించాడు. మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లో ఉంటూ ప్లకార్డులను ప్రదర్శించాడు. టీమిండియా తమ పొరుగు దేశం కాబట్టి.. గెలవాలని కోరుకోవడం ఆశ్చర్యకరమేమీ కాదని అంటూ వ్యాఖ్యానించారు పాకిస్తాన్ అభిమానులు. ఫలితం మాత్రమే వేరుగా కనిపించింది. వారి ప్రార్థనలు ఫలించలేదనే అనుకోవాలి మరి!
మెమెస్ ఏం చెబుతున్నాయంటే..?
పాకిస్తానీయులు టీమిండియా గెలవాలని మొక్కుకున్నారా? లేక ఓడిపోవాలని తిట్టుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు, ట్విట్టరెట్టీలు సరదాగా. ఎంతైనా శతృదేశానికి సంబంధించిన క్రికెట్ టీమ్ కాబట్టి వందశాతం మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేసి ఉండరని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా మెమెలను రూపొందించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. గెలవాలని మొక్కుకోవడం కంటే ఓడిపోవాలని తిట్టుకుని ఉంటారని అందుకే- టీమిండియా మ్యాచ్ ఓడిపోయిందని చెబుతున్నారు. తొలి ఓవర్ నుంచే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోయి ఆడిన విషయం తెలిసిందే. దాని ఫలితంగా- 337 భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది ఇంగ్లీష్ టీమ్.
నిరాశలో పాక్ అభిమానులు
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను నిరాశలో ముంచెత్తింది. ఇంగ్లండ్ గెలవడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు దాదాపు మూసుకునిపోయినట్టుగానే కనిపిస్తోంది. మెరుగైన రన్‌రేట్ ఉండటం వల్ల ఇంగ్లండ్ సులువుగా సెమీఫైనల్‌కు చేరుకోగలుగుతుంది. అదే ఇంగ్లండ్ ఓడిపోయి ఉంటే- ఆ జట్టు స్థానంలో పాకిస్తాన్ సెమీస్‌లో అడుగు పెట్టి ఉండేది. ఇప్పుడీ విషయమే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు మింగుడు పడట్లేదు. టీమిండియా గెలవాలని తాము ఎంతగానో కోరుకున్నామని, మ్యాచ్ ఫలితం తమకు జీర్ణం కావట్లేదని వాపోతున్నారు సర్ఫరాజ్ అహ్మద్ టీమ్ అభిమానులు. ఈ సారి పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకుని ఉండి ఉంటే.. ఖచ్చితంగా కప్ గెలిచే వాళ్లమని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications