For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. టీ20ల్లో హీరో, వన్డేల్లో 'జీరో'.. అక్తర్ ఫైర్!

Pakistan Cricket: 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ జట్టును వెస్టిండీస్ ఓడించడం పాక్ క్రికెట్ వర్గాలను కలచివేసింది. ఈ చారిత్రక పరాజయంపై మాజీ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జట్టు కొత్త కోచ్ మైక్ హెస్సన్‌ను లక్ష్యంగా చేసుకుని అతడి సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. "మైక్ హెస్సన్ ఒక మంచి టీ20 కోచ్ కావచ్చు, కానీ 50 ఓవర్ల ఫార్మాట్‌కు అతడు సరిపోతాడా అని నాకు తెలియదు" అని అక్తర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఘోర పరాజయం.. 92 పరుగులకే ఆలౌట్
వెస్టిండీస్, పాకిస్థాన్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్ విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. 295 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయి, 202 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయం పాకిస్థాన్ క్రికెట్‌ను షాక్‌కు గురిచేసింది.

Pakistan Cricket Crisis T20 Heroes ODI Zeros Shoaib Akhtar Slams Coach

కోచ్‌పై షోయబ్ అక్తర్ ఆగ్రహం
'రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌'గా పేరు పొందిన షోయబ్ అక్తర్ పాకిస్థాన్ జట్టు ఓటమికి కోచ్ మైక్ హెస్సన్ వ్యూహాలను తీవ్రంగా తప్పుపట్టారు. "వన్డే మ్యాచ్‌లకు నాణ్యమైన, అనుభవం ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. కేవలం టీ20 ఫార్మాట్‌లో మాత్రమే విజయాలు సాధించే కోచ్ వన్డే మ్యాచ్‌లకు సరిపోడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో విజయం సాధించాలంటే సమర్థవంతమైన ఆల్‌రౌండర్లు, బ్యాటర్లు, బౌలర్లు, స్పిన్నర్లు అందరూ ఉండాలి. ఈ ఫార్మాట్‌లో చిన్న పొరపాట్లు కూడా చేయకూడదు." అని షోయబ్ అక్తర్ గట్టిగా హెచ్చరించారు.

తప్పుడు విధానాలపై అక్తర్ విమర్శలు
ఈ ఓటమికి ఆటగాళ్లను నిందించడం సరికాదని అక్తర్ పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న తప్పుడు విధానాలేనని ఆరోపించారు. "ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపై మన ఆటగాళ్లు ఎప్పుడూ ఇబ్బందులు పడతారు. ఇప్పుడు కొత్త కాంబినేషన్ల పేరుతో జట్టును మార్చడం సరైన పద్ధతి కాదు. ఈ సిరీస్‌లో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు లేకపోవడం మన అదృష్టం. ఒకవేళ వారు ఉండి ఉంటే మన ఆటగాళ్లు మరింత దారుణంగా దొరికిపోయేవారు" అని అక్తర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.అలాగే జట్టులోని కీలక ఆటగాళ్లైన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా తమ అనుభవాన్ని ఉపయోగించి జట్టును గెలిపించడంలో విఫలమవుతున్నారని ఆయన ఎత్తి చూపారు.

చారిత్రాత్మక పరాజయం.. 34 ఏళ్ల తర్వాత
1991వ సంవత్సరం తర్వాత, అంటే దాదాపు 34 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌ను ఒకరోజు సిరీస్‌లో వెస్టిండీస్ ఓడించడం ఇది మొదటిసారి. ఈ ఘోర పరాజయం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎంపిక, కోచ్ నియామకంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఓటమి పాకిస్థాన్ క్రికెట్‌లో ఒక పెద్ద సంక్షోభాన్ని సృష్టించింది.

Story first published: Friday, August 15, 2025, 10:06 [IST]
Other articles published on Aug 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+