Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: అద్దె ప్రాతిపదికన ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేయనున్న పాక్ క్రికెట్ బోర్డ్.. !

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు కరాచీలోని నేషనల్ స్టేడియం, లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో అద్దె ప్రాతిపదికన కొత్త ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. క్వెట్టా, అబోటాబాద్, పెషావర్ వంటి చిన్న వేదికలపై కూడా PCB అదే విధంగా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఖర్చులను ఆదా చేసేందుకు కరాచీలో ఇప్పటికే అమర్చిన ఫ్లడ్‌లైట్లను క్వెట్టాకు, లాహోర్‌లోని రావల్పిండికి తరలించాలని పీసీబీ నిర్ణయించింది.

కరాచీ, లాహోర్‌లు కొత్త లైట్ టవర్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఆగస్టు 2024, జూలై 2025 మధ్య కాలానికి అద్దె ప్రాతిపదికన లైట్ టవర్‌లను అందించడానికి అర్హత ఉన్న కంపెనీల నుంచి టెండర్‌లను ఆహ్వానించే ప్రక్రియను PCB ప్రారంభించింది."ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి అంతర్జాతీయ స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌లు ఎక్కువగా డే నైట్ లు జరుగుతాయి. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలు, అంతరాయం లైటింగ్ ను అందించాలి" అని అతను ఓ పీసీబీ అధికారి పిటిఐకి వెల్లడించాడు.

Pakistan Cricket Board to install floodlights on rental basis

కరాచీ, లాహోర్, రావల్పిండి, ముల్తాన్, ఫైసలాబాద్, అబోటాబాద్, క్వెట్టా, పెషావర్ తదితర ప్రాంతాలకు జనరేటర్ల ఏర్పాటుకు పీసీబీ టెండర్లను ఆహ్వానించింది. పవర్‌లో హెచ్చుతగ్గులు, లోడ్ షెడ్డింగ్ సమస్యల కారణంగా మైదానంలోని లైట్ టవర్‌లకు శక్తినివ్వడానికి PCB జనరేటర్‌లను ఉపయోగిస్తుందని తెలుస్తోంది. PCB ఇప్పటికే కరాచీ, లాహోర్, రావల్పిండిలోని స్టేడియాల ఇంటెన్సివ్ ఫేస్‌లిఫ్ట్‌ను నిర్వహిస్తోంది.

దీని కారణంగా కరాచీలో బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ ప్రేక్షకులు లేకుండా జరగనుంది. పీసీబీ దాని ఆర్థిక బడ్జెట్‌లో కవర్ చేయడానికి ఇప్పటికే నిధులు కేటాయించింది. స్టేడియాల ఫేస్‌లిఫ్ట్, పునరుద్ధరణకు సంబంధించిన అన్ని ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తోంది.

Story first published: Sunday, August 18, 2024, 17:04 [IST]
Other articles published on Aug 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+