Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోన్లు లాక్కుంటే పరుగులొచ్చేస్తాయా?: పాక్ జట్టులో మరో రచ్చ!

ENG vs PAK: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లీడ్స్, లార్డ్స్ టెస్టుల్లో ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన వైఖరిని తీసుకుంది. దీనికి తోడు ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న మూడో, చివరి టెస్టుకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొంతమంది ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం కొత్త వివాదానికి తెరతీసింది. ఆటగాళ్ల ఫోన్లను చివరి టెస్ట్ ముగిసే వరకు బోర్డు వద్దే ఉంచుతారని వార్తలు వస్తున్నప్పటికీ.. ఏ ఆటగాళ్ల పోన్లు స్వాధీనం చేసుకున్నారు? బోర్డు ఈ చర్య ఎందుకు తీసుకుంది? అనే అంశాలపై పీసీబీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.

IND vs PAK: పాక్‌పై ఏకపక్ష విజయం.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?

IND vs PAK: పాక్‌పై ఏకపక్ష విజయం.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?

మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు.. ఐసీసీ నిబంధనలు
సాధారణంగా మ్యాచ్ రోజుల్లో ఆటగాళ్ల ఫోన్లను లాకర్లలో ఉంచుతారు. కానీ సిరీస్ మధ్యలో ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిలోని డేటాను క్షుణ్ణంగా పరిశీలించడం తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బెట్టింగ్ లేదా మ్యాచ్ ఫిక్సింగ్ విచారణ సమయంలో మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో ఇది చర్చనీయాంశంగా మారింది.

Pakistan Cricket Board Seizes Phones of Pak Players Amid Match-Fixing and Crisis in England Full Details

ఆటగాళ్లపై ఆరోపణలు
జట్టు నుంచి తొలగించిన వారిలో కేవలం ఫామ్ లేకపోవడమే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ సిరీస్‌ను తప్పించుకోవడానికి గాయాన్ని నటించాడని బోర్డు అనుమానిస్తోంది. అలాగే స్టార్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పాడు చేస్తూ వర్గపోరును ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇమామ్, రిజ్వాన్‌లతో పాటు సల్మాన్ అలీ అఘా, అలీ ఉస్మాన్, ఖుర్రమ్ షెహజాద్, అమీర్ జమాల్, మహమ్మద్ ఒవైస్ జాఫర్‌లను కూడా పాకిస్థాన్‌కు వెనక్కి పంపించారు. పేలవ ప్రదర్శన కారణంగా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను కూడా పదవుల నుంచి తొలగించారు.

IND vs PAK: అందుకే చిత్తుగా ఓడాం: పాకిస్థాన్ కెప్టెన్

Also Read

IND vs PAK: అందుకే చిత్తుగా ఓడాం: పాకిస్థాన్ కెప్టెన్

తాత్కాలిక కోచ్ నియామకం, కొత్త జట్టు
సర్ఫరాజ్ స్థానంలో మూడో టెస్ట్ కోసం వైట్-బాల్ కోచ్ మైక్ హెసన్‌కు టెస్ట్ జట్టు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. లీడ్స్, లార్డ్స్ టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే చివరి టెస్ట్ కోసం ఐదుగురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లతో కూడిన ఏడుగురు కొత్త ముఖాలను జట్టులోకి చేర్చింది.

Story first published: Sunday, September 6, 2026, 10:59 [IST]
Other articles published on Sep 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+