పాక్ ఆటగాళ్లకు భారీ షాక్.. టీ10 లీగ్‌కు అనుమతి రద్దు!

కరాచి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ దేశ ఆటగాళ్లకు భారీ షాక్ ఇచ్చింది. పాక్ ఆటగాళ్లు అబుదాబి వేదికగా వచ్చే నెలలో జరగనున్న టీ10 క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు ఇచ్చిన అనుమతిని పీసీబీ ఉపసంహరించుకుంది. ఇదివరకు టీ10 క్రికెట్‌కు పీసీబీ అనుమతి ఇచ్చినా.. తాజాగా పాల్గొనవద్దని స్పష్టం చేసింది. ఆటగాళ్లపై పనిభారం అధికమవుతుందనే ఉద్దేశంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. పీసీబీ తాజా నిర్ణయంతో 10 లీగ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎవరూ ఉండరు.
'ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లపై పనిభారం పెరగకూడదని టీ10 లీగ్‌కు ఇచ్చిన అనుమతి రద్దు చేసాం. మా నిర్ణయం సరైందే. పాక్ ఆటగాళ్లు త్వరలో దేశవాళీ క్వాద్-ఈ-అజామ్ ట్రోఫీలో పాల్గొనాల్సి ఉంది. దీంతో గతంలో టీ10 క్రికెట్‌కు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నాం' అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే టీ10 టోర్నీలో పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. వాళ్ళు టోర్నీలో ఆడుకోవచ్చు.
నవంబర్ 15 నుంచి 24 వరకు ఈ టోర్నీ జరగనుంది. దీనిలో ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. ఈ లీగ్‌లో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది బరిలోకి దిగనున్నాడు. అఫ్రిది కలందర్స్ జట్టు జట్టు తరుపున ఆడనున్నాడు. ఈ టీ10 లీగ్ మూడో సీజన్‌లో భారత మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ కూడా ఆడుతున్నాడు. ఈ టోర్నీలో శ్రీలంక ఆటగాళ్లు లసిత్ మలింగా, థిసారా పెరీరా, నిరోషన్ డిక్‌వెల్లా.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. విండీస్ హిట్టర్ కీరన్ పోలార్డ్ పలు జట్లకు ఆడుతున్నారు.
టీ20లలో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ బిగ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్.. టీ10లో కూడా ఆడుతున్నాడు. అబుదాబి టీ10లో భాగంగా నార్తర్న్ వారియర్స్ జట్టుకు రసెల్ ఆడుతున్నాడు. ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేరడానికి టీ10 ఫార్మాట్ దోహదం చేస్తుందని రసెల్ పేర్కొన్నాడు. 'ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. దీనిని క్రికెటర్లందరూ ఆస్వాదిస్తారు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున పోరాడటానికి ప్రతి ఆటగాడు ఇష్టపడతాడు. టీ20 కంటే టీ10 అత్యంత పొట్టి ఫార్మాట్. ఒలింపిక్స్‌కు టీ10 ఫార్మాట్ అయితే సరిగ్గా సరిపోతుంది' అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications