For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup గెలుద్దామనే: పాకిస్తాన్ టీమ్‌లో మార్పులు: సీనియర్లకు పిలుపు

Pakistan Cricket Board may make two changes to their T20 World Cup Squad 2021

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్ క్రమంగా ముగింపు దశకు వస్తోంది. అన్ని జట్లు కూడా 10, అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లను ఆడేశాయి. అక్టోబర్ 8వ తేదీ నాటికి లీగ్ దశ ముగిసిపోతుంది. రెండు రోజుల విరామం తరువాత ప్లే ఆఫ్ మ్యాచులు ఆరంభమౌతాయి. ఎనిమిదింట్లో నాలుగు జట్లే ప్లే ఆఫ్ చేరాల్సి ఉంది. 15వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. దీనితో ఐపీఎల్ ముగుస్తుంది.

తొలి మ్యాచ్‌లో ఎవరెవరు?

తొలి మ్యాచ్‌లో ఎవరెవరు?

ఆ వెంటనే అంటే 17వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభమౌతుంది. వచ్చేనెల 14వ తేదీన ఫైనల్‌ ఉంటుంది. ఈ బిగ్ ఈవెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లల్లో షెడ్యూల్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మొత్తం 45 మ్యాచులను ఆడాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్ 17వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు ఒమన్‌లోని అల్ అమెరాత్ స్టేడియంలో మొదలవుతుంది. ఒమన్, పపువా న్యూగినియా తొలి మ్యాచ్‌లో తలపడతాయి.

టీమిండియాలో మార్పులకు ఛాన్స్?

టీమిండియాలో మార్పులకు ఛాన్స్?

కొన్ని చిన్న జట్లతో పాటు క్రికెట్ ఆడే అన్ని దేశాలు కూడా ఇందులో పాల్గొనబోతున్నాయి. దీనికోసం ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి కూడా. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా టీమిండియా స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను ఆడబోతోంది భారత జట్టు. ఐపీఎల్ మ్యాచుల్లో ఆటగాళ్ల పెర్‌ఫార్మెన్స్‌ను ఆధారంగా చేసుకుని జట్టులో మూడు లేదా నాలుగు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.

పాక్ టీమ్‌లోనూ..

పాక్ టీమ్‌లోనూ..

భారత్ తరహాలోనే పాకిస్తాన్ కూడా జట్టులో మార్పులు చేయడానికి సమాయాత్తమౌతున్నట్లు తెలుస్తోంది. బాబర్ ఆజమ్ సారథ్యంలో పాకిస్తాన్ ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దీనికోసం జట్టును ఇదివరకే ప్రకటించింది. ఇందులో షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఆజమ్ ఖాన్, హ్యారిస్ రవూఫ్, హసన్ అలీ, ఇమద్ వసీం, ఖుష్దిల్ షా్, మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ హస్నయిన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ వసీం జూనియర్, షహీన్ షా అఫ్రిదీ, షోయబ్ మక్సూద్ ఉంటారు. ఫకర్ జమాన్, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ రిజర్వ్‌ ప్లేయర్లు.

అనుభవజ్ఞులు లేకపోతే ఎలా..

అనుభవజ్ఞులు లేకపోతే ఎలా..

కాగా- ఈ జట్టులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్లు సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్‌ను జట్టులోకి తీసుకుంటారని ది డాన్ వెల్లడించింది. అదే సమయంలో- అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం పెద్దగా లేని ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా‌ను వెనక్కి రప్పిస్తారని పేర్కొంది. జట్టు కూర్పు విషయంలో కేప్టెన్ బాబర్ ఆజమ్ సంతోషంగా లేడని, అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది. అనుభవజ్ఞులు లేకపోవడం వల్ల జట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అతను క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌కు ఛాన్స్..

షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌కు ఛాన్స్..

అతని అభిప్రాయంతో ఏకీభవించిన బోర్డు అధికారులు.. మార్పులకు పూనుకున్నట్లు చెబుతున్నారు. షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌కు జట్టులో చోటు కల్పిస్తారని ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా‌ను జట్టు నుంచి తప్పిస్తారనే ది డాన్ పేర్కొంది. ఈ మార్పులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గానీ, జట్టు కోచ్ గానీ అధికారికంగా ధృవీకరించలేదని తెలిపింది. దీనిపై క్రికెట్ బోర్డులో చర్చలు సాగుతున్నాయని స్పష్టం చేసింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలో పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, September 29, 2021, 16:42 [IST]
Other articles published on Sep 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+