32ఏళ్ల తర్వాత కరాచీకి వెళ్లనున్న న్యూజిలాండ్ జట్టు.. రెండు పర్యటనల షెడ్యూల్ ప్రకటించిన పాక్ బోర్డు

2022 డిసెంబరు చివరి వీక్ నుంచి 2023 జనవరి తొలి భాగం వరకు న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్లో తలపడనున్నాయి. ఏప్రిల్ - మే నెల మధ్యలో 2023లో ఇరు జట్ల మధ్య మరోసారి ద్వైపాక్షిక సిరీస్లు జరగనున్నాయి. అక్టోబర్ 11న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ విషయమై న్యూజిలాండ్ పాకిస్తాన్లో పర్యటించే పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పర్యటనలో వన్డేలు, టీ20 సిరీస్లు జరగనున్నాయి. ఇక తొలి పర్యటనలో డిసెంబర్ 27నుంచి జనవరి 15వరకు.. రెండు టెస్టులు, మూడు వన్డేలు జరుగుతాయి. తర్వాత ఏప్రిల్ 13 నుంచి మే 7వరకు ఐదు టీ20లు, 5 వన్డేలు జరగుతాయి.
మొదటి టెస్ట్ డిసెంబర్ 27 నుండి 31వరకు కరాచీలో జరగనుంది. రెండో టెస్ట్ ముల్తాన్ వేదికగా జనవరి 4 నుంచి జరగనుంది. ఈ టెస్టులు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో భాగంగా జరగనున్నాయి. అలాగే జనవరి 11, 13, 15వ తేదీల్లో జరిగే మూడు వన్డే మ్యాచ్‌లు ICC వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా జరగుతాయి. ఈ మూడు వన్డేలు కరాచీ వేదికగా జరగనున్నాయి. ఇకపోతే 1990 అక్టోబర్ తర్వాత కరాచీకి న్యూజిలాండ్ వెళ్లడం ఇదే తొలిసారి. అంటే సుమారు 32ఏళ్ల తర్వాత న్యూజిలాండ్లో కరాచీలో మ్యాచ్ ఆడబోతుందన్నమాట. కొత్త వేదిక అయిన ముల్తాన్ మేలో వెస్టిండీస్‌తో మూడు వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ తొలి టెస్ట్ మ్యాచ్ మాత్రం పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ (డిసెంబర్ 9-13) కానుంది. న్యూజిలాండ్‌తో పాక్ ఆడబోయే రెండో టెస్ట్ ఈ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ కానుంది.
ఇకపోతే న్యూజిలాండ్ జట్టు పాక్ పర్యటనలో రెండో సారి కరాచీలో ఏప్రిల్ 13, 15, 16, 19 తేదీల్లో నాలుగు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అయిదో టీ20 మ్యాచ్, 2 వన్డేలు లాహోర్‌లో జరుగుతాయి. లాహోర్ వేదికగా ఏప్రిల్ 23, 26, 28 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. చివరి మూడు వన్డేలు రావల్పిండిలో మే 1, 4, 7తేదీల్లో జరుగుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications