హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను పాకిస్తాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. స్వదేశంలో ఆదివారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో శ్రీలంకపై 36 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాకిస్థాన్‌లో ఎనిమిదేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా యూఏఈలో రెండు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక, పాకిస్థాన్... ఆదివారం లాహోర్‌లోని గడాఫీ స్డేడియంలో మూడో టీ20 ఆడాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో షోయబ్ మాలిక్ (51) హాఫ్ సెంచరీ చేయగా ఫకర్ జమాన్ (31), ఉమర్ అమిర్ (45), బాబర్ ఆజమ్ (34 నాటౌట్) సత్తా చాటారు. అనంతరం 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
లంక తరుపున దాసున్ షనక (54) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ అమీర్ తన కెరీర్ బెస్ట్ (4/13) బౌలింగ్ నమోదు చేశాడు. తాజా టీ20తో సొంతగడ్డపై అంతర్జాతీయ మ్యాచ్‌ల దిశగా పాకిస్థాన్ మరో అడుగు వేసింది. ఇటీవల వరల్డ్ లెవెన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.