Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'పాక్ ఆటగాళ్లకి నేను కోహ్లీని ఓ ఉదాహరణగా చూపుతా'

'Kohli Is The Best Cricketer In The World' Says Pak Coach
Pakistan coach Mickey Arthur feels five Pakistani cricketers would bring good value to IPL

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి పాక్ ప్లేయర్లు చాలా విషయాలు నేర్చుకోవాలని ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్ చెప్పుకొచ్చాడు. దుబాయి వేదికగా ముగిసిన ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌తో రెండు సార్లు తలపడిన పాకిస్థాన్ జట్టు ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

అనంతరం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతుండగా.. టీమిండియా వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

టెస్టుల్లో 24వ సెంచరీని సాధించిన కోహ్లీ

టెస్టుల్లో 24వ సెంచరీని సాధించిన కోహ్లీ

రాజ్‌కోట్ టెస్టులో 184 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. 123 ఇన్నింగ్స్‌ల్లో 24వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత అత్యంత వేగంగా 24 టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్లో విరాట్‌ కోహ్లీకి ఇది 50వ సెంచరీ

అంతర్జాతీయ క్రికెట్లో విరాట్‌ కోహ్లీకి ఇది 50వ సెంచరీ

125 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్‌ కోహ్లీకి ఇది 50వ సెంచరీ. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టక ముందు 250 ఇన్నింగ్స్‌ల్లో 29 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 134 ఇన్నింగ్స్‌ల్లోనే 30 సెంచరీలు సాధించడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి వచ్చి చేరింది. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండోస్థానానికి చేరుకున్నాడు.

పరుగుల దాహం, గెలవాలనే తపన

పరుగుల దాహం, గెలవాలనే తపన

23 సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా (29) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో కోహ్లి కెప్టెన్సీ, బ్యాటింగ్‌ గురించి తాజాగా మికీ ఆర్థర్ మీడియాతో మాట్లాడాడు. "విరాట్ కోహ్లీ పరుగుల దాహం, గెలవాలనే తపన అతన్ని అత్యుత్తమ స్థాయిలో నిలబెడుతోంది. మైదానంలో ఊహకందని రీతిలో అతను చెలరేగిపోతున్నాడు" అని అన్నాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌ కోహ్లీ మాత్రమే

ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌ కోహ్లీ మాత్రమే

"కోహ్లీ జీవన శైలి, నెట్స్‌లో శ్రమిస్తున్న తీరు, ఫిట్‌నెస్ అమోఘం. పాకిస్థాన్ ఆటగాళ్లకి నేను తరచూ కోహ్లీని ఓ ఉదాహరణగా చూపుతుంటా. ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్స్‌ అని నా భావన. ఇప్పుడు ఏబీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ కూడా బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా జట్టుకి దూరంగా ఉన్నాడు. దీంతో, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌ కోహ్లీ మాత్రమే" అని అన్నాడు.

Story first published: Monday, October 8, 2018, 18:37 [IST]
Other articles published on Oct 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+