పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని సాధించింది. టెస్టు ఫార్మాట్‌లో పాక్‌పై తొలిసారి గెలుపు రుచి చూసింది. రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌ను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మూడు టెస్టుల సిరీస్‌లో బంగ్లా ఘనంగా బోణీ కొట్టింది. అయితే సొంతగడ్డపై తమ అనూహ్య ఓటమికి గల కారణాలను పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ వివరించాడు.
స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోకపోవడం తమ ఓటమికి ప్రధాన కారణమని షాన్ మసూద్ అంగీకరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ముందుగా డిక్లేర్ చేయడం ఓటమిపై కొంతమేర ప్రభావం చూపించిందని, అయితే మ్యాచ్‌ను వేగవంతం చేయడానికే ఆ నిర్ణయం తీసకున్నామని తెలిపాడు. ఊహించనట్లుగా పిచ్ సహకరించలేదని పేర్కొన్నాడు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం పేలవ వ్యూహమని అన్నాడు.

బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి కారణం కాదని, మొత్తంగా చాలా పొరపాట్లు చేశామని పాకిస్థాన్ కెప్టెన్ చెప్పాడు. అమీర్ జమాల్, షాజిద్ ఖాన్ అందుబాటులో లేకపోవడం తీవ్ర ప్రభావం చూపించిందని పేర్కొన్నాడు. అలాగే దేశవాళీ క్రికెట్‌లో రావల్పిండి పిచ్ ఓ రకంగా, ఇవాళ టెస్టులో భిన్నంగా స్పందించిందని తెలిపాడు. ఈ ఓటమి ఓ గుణపాఠమని, స్వదేశంలో పిచ్‌ల నుంచి ఏం ఆశించాలో తెలిసొచ్చిందని అన్నాడు. ఈ పొరపాట్లను పునరావృతం చేయకుండా చూసుకుంటామని షాన్ మసూద్ వెల్లడించాడు.
ఓవర్‌నైట్ స్కోరు 23/1తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్ 146 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్ (51; 80 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్ షపికీ (37), బాబర్ అజామ్ (22) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మెహదీ హసన్ నాలుగు, షకిబ్ అల్ హసన్ మూడు వికెట్లతో చెలరేగారు. అనంతరం 30 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.
కాగా, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) రాణించారు. నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, షాజాద్, మహ్మద్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, 117 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 146 స్కోరే సాధించింది