అక్తర్ కావాలనే నన్ను టార్గెట్ చేశాడు: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

హైదరాబాద్: జాతి వివక్ష వ్యాఖ్యలు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. షోయబ్ అక్తర్ మాటలు విమర్శల్లా లేవని, అతడి మాటలు వ్యక్తిగతంగా దాడి చేసినట్లు ఉన్నాయని సర్ఫరాజ్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై ఐసీసీ నాలుగు వన్డేల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ నిషేధంతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగొచ్చిన సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ "అక్తర్ వ్యక్తిగతంగా దాడి చేశాడు. అతని మాటలు విమర్శల్లా లేవు. ఇప్పటికే నేను నా తప్పును అంగీకరించాను. దక్షిణాఫ్రికా ఆటగాడితో అలా ప్రవర్తించడం తప్పే. ఇందుకు చింతిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు.

ఈ తప్పు నుంచి ఎంతో నేర్చుకున్నా
"ఈ తప్పు నుంచి ఎంతో నేర్చుకున్నా. క్షమాపణ కూడా చెప్పాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ)కు ధన్యవాదాలు. నాపై ఐసీసీ విధించిన నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని కూడా అంగీకరిస్తున్నా. ఈ వివాదం ఇంతటితో ముగిసింది. పీసీబీ ఏం చెప్పినా పాటించడానికి సిద్ధంగా ఉన్నా. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కూడా ఆడతాను" అని సర్ఫరాజ్ అన్నాడు.

అసలేం జరిగింది?
గత మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఫెలుక్వాయోను ఉద్దేశించి 'ఒరేయ్.. నల్లోడా! ఈరోజు మీ అమ్మ ఎక్కడ కూర్చుంది? నీకు ఏం కావాలని ఆమెను అడిగావు' అని సర్ఫరాజ్ దూషించిన వ్యాఖ్యలు స్టంప్స్‌మైక్‌లో రికార్డు కావడంతో అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫెలుక్వాయోకు సర్ఫరాజ్ క్షమాపణలు
తన వ్యాఖ్యల పట్ల దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఫెలుక్వాయోకు సర్ఫరాజ్ క్షమాపణలు చెప్పినప్పటికి నిబంధనల మేరకు ఐసీసీ అతడిపై చర్యలకు ఉపక్రమించింది. అయితే ఈ తరహా వ్యాఖ్యలతో సర్ఫరాజ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు.
సర్ఫరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే
"ఓ పాకిస్తానీయుడిగా ఈ తరహా వ్యాఖ్యలను సమర్ధించను. తన వ్యాఖ్యల పట్ల సర్ఫరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే" అని ఘాటుగా ట్వీట్ చేశాడు. అయితే పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఒత్తిడో ఏమో తెలియదు కానీ వెంటనే మళ్లీ తన వ్యాఖ్యలపై "సర్ఫరాజ్ వంటి ఆటగాడు పాక్‌కు ఎంతో అవసరమని, అతను సాధారణ శిక్షతో భయపడతాడని ఆశిస్తున్నాను" అని మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications