అదే మా కొంపముంచింది: పాక్ కెప్టెన్
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూడటంపో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా తన జట్టు బ్యాటింగ్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచిందని ఆమె అంగీకరించింది. ప్రపంచ కప్‌లో తమకు ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉందని.. రాబోయే మ్యాచుల్లో బ్యాటర్లు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఆడి రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫాతిమా సనా స్పష్టం చేసింది.
ఫీల్డింగ్ తప్పిదాలు, ఆఖరి ఓవర్ల విధ్వంసమే కొంపముంచింది!
మ్యాచ్‌లో తమ వ్యూహాలు ఎక్కడ దెబ్బతిన్నాయనే విషయాన్ని పాక్ కెప్టెన్ విశ్లేషించింది. "ఇన్నింగ్స్ మొదటి 15 ఓవర్ల వరకు మా బౌలింగ్, ఫీల్డింగ్ ప్రణాళికాబద్ధంగా బాగానే సాగాయి. కానీ ఆ తర్వాత చివరి ఓవర్లలో మేము చాలా అదనపు పరుగులు ఇచ్చేశాం. ఒక దశలో స్లో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా ఒక ఫీల్డర్‌ను లోపలికి తీసుకురావాల్సి వచ్చింది, అది మాకు భారీ నష్టాన్ని చేకూర్చింది. రాబోయే మ్యాచ్‌లలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా మెరుగుపరుచుకుంటాం" అని ఫాతిమా సనా చెప్పుకొచ్చింది. స్లో ఓవర్ రేట్ పెనాల్టీ పడటానికి భారత బ్యాటర్ల లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఒక కారణం కావచ్చని, తమ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నందున ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి వారు అనుభవాన్ని గడిస్తున్నారని ఆమె పేర్కొంది.

సీనియర్ల తడబాటుపై కెప్టెన్ అసంతృప్తి:
క్రికెట్‌లో ఫీల్డింగ్ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ఫాతిమా సనా తమ జట్టు ఫీల్డర్లపై అసహనం వ్యక్తం చేశారు. "క్యాచ్‌లు విడిచిపెడితే మ్యాచ్‌లు గెలవడం అసాధ్యం. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో మేము చాలా ముఖ్యమైన క్యాచ్‌లను చేజార్చాం, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లే ఇలాంటి తప్పులు చేయడం విచారకరం. ఫీల్డింగ్‌లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు మొత్తం మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తాయి. కాబట్టి తదుపరి మ్యాచ్ నాటికి మేము బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ను కూడా ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాలి" అని ఫాతిమా సనా హెచ్చరించింది.
పవర్‌ప్లేలో గెలిచినా.. మిడిల్ ఆర్డర్‌లో కుప్పకూలాం..
మ్యాచ్‌లో భిన్నంగా ఏమైనా చేయగలిగేవారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాము ముందే అనుకున్న ప్రణాళికలను మైదానంలో అమలు చేయడానికే ప్రయత్నించామని కెప్టెన్ పేర్కొంది. పవర్‌ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తాము సానుకూల దృక్పథంతో ఆడి పైచేయి సాధించామని, కానీ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలిపోవడం కోలుకోలేని దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే తమ బ్యాటింగ్ విభాగం మరింత బలంగా పుంజుకోవాలని ఫాతిమా సనా ముగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications