ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా పాక్ కెప్టెన్.. అది లేకుంటే భారత్‌కే దక్కేది!

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్తగా తీసుకొచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఫస్ట్ టైమ్ ఇతరులకు దక్కింది. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ఈ అవార్డులను అందజేస్తుండగా.. వరుసగా మూడు భారత ఆటగాళ్లే సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం ఆ చాన్స్ మిస్సయ్యింది. ఐపీఎల్ 2021 సీజన్ కారణంగా భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవడంతో ఇతర ఆటగాళ్లకు అవకాశం దక్కింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఈ ఘనత వరించింది. ఏప్రిల్ నెలలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ల్లో బాబర్ ఆజామ్ దుమ్ములేపాడు. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించాడు.

కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌తో..

కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌తో..

మూడో వన్డేలో 82 బంతుల్లో 94 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజామ్.. వన్డేల్లో కెరీర్ బెస్ట్ నెంబర్ వన్ ర్యాక్ అందుకున్నాడు. 59 బంతుల్లో 122 రన్స్ చేసి టీ20 సిరీస్ గెలవడంలోనూ కీలకపాత్ర పోషించాడు. ఈ అవార్డు కోసం బాబర్‌తో సహచర ఆటగాడు ఫకార్ జమాన్, నెపాల్ క్రికెటర్ కుషాల్ భుర్టెల్ పోటీ పడగా.. అభిమానులు బాబర్‌కే మద్దతు తెలిపారు. ఇక మహిళల కెటగిరీల్లో ఆస్ట్రేలియా టీమ్ వికెట్ కీపర్ అలీసా హీలీని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అలీసా బ్యాటింగ్, కీపింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

వరుసగా మూడు భారత్‌కే..

వరుసగా మూడు భారత్‌కే..

ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించగా.. జనవరి నెలకు వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌, ఫిబ్రవరి నెలకు ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, మార్చి నెలకు భువనేశ్వర్ కుమార్ ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పంత్, ఇంగ్లండ్‌తో రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్‌లు సత్తా చాటారు. వీరి సూపర్ పెర్ఫామెన్స్‌తో భారత్ అద్భుత విజయాలనుందుకుంది. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌లు అనంతరం ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభం కావడంతో భారత అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేక్ పడింది. లేకుంటే ఈ నెల కూడా భారత్‌కే దక్కేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఓటింగ్ ద్వారా విజేత..

ఓటింగ్ ద్వారా విజేత..

మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 10, 2021, 17:07 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X