For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Awards 2021: పాకిస్థాన్‌ కెప్టెన్ బాబ‌ర్ అజామ్‌కు అవార్డుల పంట‌

Pakistan Captain Babar Azam win 3 ICC Awards 2021

2021 సంవ‌త్స‌రానికి గాను ఐసీసీ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన అవార్డుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్‌కు పంట పండింది. అత‌నొక్క‌డే ఏకంగా మూడు అవార్డులు ద‌క్కించుకున్నాడు. అలాగే జ‌ట్టు ప‌రంగా కూడా ఈ సారి ఎక్కువ అవార్డులు పాకిస్థాన్‌కే వచ్చాయి. మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌కు వ‌చ్చిన అవార్డును కూడా క‌లుపుకుంటే 2021 సంవ‌త్స‌రానికి ఐసీసీ ప్ర‌క‌టించిన అవార్డుల్లో పాకిస్థాన్‌కే 4 పుర‌స్కారాలు ద‌క్క‌డం విశేషం. 2021 సంవ‌త్స‌రానికి గాను పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్‌కు ఏకంగా 3 అవార్డులు ద‌క్కాయి. వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్, వ‌న్డే కెప్టెన్ ఆఫ్ ది ఇయ‌ర్, టీ20 కెప్టెన్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డులను బాబ‌ర్ అజామ్ గెలుచుకున్నాడు. మొత్తంగా 2021లో బాబ‌ర్ అజామ్ బ్యాట‌ర్‌గా, కెప్టెన్‌గా స‌త్తా చాటాడు. కెప్టెన్‌గా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌ను అజామ్ సెమీఫైన‌ల్ వ‌ర‌కు తీసుకెళ్లాడు. బ్యాట‌ర్‌గానూ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అజామ్ స‌త్తా చాటాడు. అలాగే వ‌న్డే క్రికెట్‌లోనూ బ్యాట‌ర్‌గా రాణించ‌డంతోపాటు కెప్టెన్‌గా జ‌ట్టును విజ‌యవంతంగా న‌డిపించాడు.

ఐసీసీ మొద‌ట‌ వ‌న్డే క్రికెట‌ర్‌ ఆఫ్ ది ఇయ‌ర్‌కు బాబ‌ర్ అజామ్, షకీబ్ అల్ హసన్, జన్నెమాన్ మలన్, పాల్ స్టెర్లింగ్‌లను నామినేట్ చేసింది. కానీ చివ‌ర‌గా బాబ‌ర్ అజామ్ విజేత‌గా నిలిచాడు. 2021లో బాబ‌ర్ ఆడింది 6 వ‌న్డేలే అయినా జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను పాక్ జ‌ట్టు 2-1తో గెలుచుకుంది. ఆ సిరీస్‌లో అత‌ను 228 ప‌రుగుల‌తో స‌త్త చాటాడు. అలాగే ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌లో పాక్ జ‌ట్టు 0-3తో ఓడిన‌ప్ప‌టికీ బాబ‌ర్ అజామ్ బ్యాట‌ర్‌గా రాణించాడు. 177 ప‌రుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో మిగ‌తా పాక్ బ్యాట‌ర్లెవ‌రూ క‌నీసం 100 ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయారు. మొత్తంగా 2021 ఏడాదిలో పాక్ కెప్టెన్ 3 అవార్డుల‌తో స‌త్తా చాటాడు.

పాకిస్థాన్ ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ కూడా 2021 ఐసీసీ టీ20 ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును గెలుచుకుని స‌త్తా చాటాడు. 2021లో 29 టీ20 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్ 73 స‌గ‌టుతో 1,326 పరుగులు సాధించాడు. అలాగే ఇంగ్లండ్‌కు జ‌ట్టుకు చెందిన టమ్మీ ఐసీసీ మ‌హిళా టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. ఇక ద‌క్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్ ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును గెలుచుకున్నాడు. మరైస్ ఎరాస్మస్ ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవ‌డం ఇది మూడో సారి. అలాగే 100 వ‌న్డే మ్యాచ్‌ల‌కు అంపైరింగ్ చేసిన మూడో వ్య‌క్తిగా మరైస్ ఎరాస్మస్ నిలిచాడు.

Pak Opener Mohammad Rizwan Sets New T20 World Record
Story first published: Monday, January 24, 2022, 14:16 [IST]
Other articles published on Jan 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+