Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral video: అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు భయ్యా: షాట్ మిస్ కావడంతో ఈ స్టార్ ఓపెనర్ అనూహ్య చర్య

Pakistan Captain Babar Azam smashes pitch out of frustration, video goes viral on

ఇస్లామాబాద్: మరో 10 రోజుల్లో ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 ఆరంభం కానుంది. మొత్తం 16 జట్లు ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌లో పోటీ పడబోతున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ సారి చిన్న దేశాలకు చెందిన క్రికెట్ జట్లు ప్రపంచకప్ టోర్నమెంట్‌లో సందడి చేయనున్నాయి. పపువా న్యూగినియా, నమీబియా, ఒమన్, నెదర్లాండ్, స్కాట్లాండ్.. ఇలా కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ నెల 17వ తేదీన తొలి మ్యాచ్‌లో పపువా న్యూగినియా-ఒమన్ జట్లు తలపడతాయి. ఒమన్‌లో ఈ మ్యాచ్ ఉంటుంది.

15న బయలుదేరనున్న పాక్

15న బయలుదేరనున్న పాక్

ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ నెల 15వ తేదీన బయలుదేరనుంది. స్టార్ ఓపెనర్ బాబర్ ఆజమ్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందీ టీమ్. మొత్తం 15 మందితో కూడిన టీమ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌లోనే టీమిండియాను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఈ నెల 24వ తేదీన జరుగనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది.

ఐపీఎల్ తరహాలోనే..

ఐపీఎల్ తరహాలోనే..

టీ20 ప్రపంచకప్ ముంగింట్లో భారత జట్టు సభ్యులందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఈ అనుభవం ప్రపంచకప్‌లో ఖచ్చితంగా ఉపయోగపడుతోంది. పాకిస్తాన్ కూడా దేశీయంగా టీ20 లీగ్ టోర్నమెంట్‌ను ఆడుతోంది. వరల్డ్ కప్‌లో ఆడనున్న జట్టు సభ్యులందరూ వేర్వేరు ఫ్రాంఛైజీల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం లీగ్ టోర్నీ సెకెండ్ హాఫ్ ఆరంభం కావాల్సి ఉంది. ఈ నెల 13వ తేదీన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఒక్కరోజు విరామం అనంతరం పాక్ జట్టు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కేస్తుంది.

ఫుల్ ఫామ్‌లో ఉన్న బాబర్..

ఫుల్ ఫామ్‌లో ఉన్న బాబర్..

ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ టీమ్ కేప్టెన్ బాబర్ ఆజమ్.. ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్తాన్ నేషనల్ టీ20లో అతను సెంట్రల్ పంజాబ్‌కు ఆడుతున్నాడు. అతని సారథ్యంలో ఈ టీమ్ వరుస విజయాలను అందుకుంటోంది. నార్తరన్ పాకిస్తాన్ టీమ్‌పై ఆడిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 63 బంతుల్లో 105 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు.

ఇందులో 11 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మొత్తం 20 ఓవర్లల్లో 200 పరుగుల లక్ష్యాన్ని నార్తరన్‌కు నిర్దేశించిన సెంట్రల్ పంజాబ్. ఈ స్కోర్‌ను అవలీలగా ఛేదించింది నార్తరన్ పాకిస్తాన్. హైదర్ అలీ 53 బంతుల్లో 91 పరుగులు చేయడంతో విజయం సునాయసమైంది.

స్పిన్‌ను ఆడలేక..

ఈ మ్యాచ్‌లో మాంఛి ఊపు మీద కనిపించాడు బాబర్ ఆజమ్. బౌలర్లందరినీ చితగ్గొట్టినప్పటికీ.. ఇమద్ వసీంను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటానికి ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ ఇమద్ వసీం ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులను సమర్పించుకున్నారు. తన బౌలింగ్‌లో బాబర్ ఆజమ్‌ను కూడా కట్టి పడేశాడతను. ఓ దశలో అతని బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌ను ఆడటానికి ప్రయత్నించి మిస్ అయ్యాడు. దీనితో తీవ్ర అసహనానికి గురయ్యాడు. బ్యాట్‌తో పిచ్‌కేసి బాదాడు.

Story first published: Wednesday, October 6, 2021, 14:27 [IST]
Other articles published on Oct 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+