Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాబర్ ఆజమ్ బలిపశువు మారాడు - విమర్శించడం వల్ల లాభం లేదు: పాక్ బౌలర్ సంచలనం..!!

Pakistan captain Babar Azams leadership is like sacred cow, says Mohammad Hafeez

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న ఘోర పరాభవాన్ని పాకిస్తాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోవట్లేదు. భారత్‌లో ఏ స్థాయిలో సెలబ్రేషన్స్ చోటు చేసుకున్నాయో.. అదే స్థాయిలో పొరుగుదేశంలో నిరసన ప్రదర్శనలు వ్యక్తమౌతోన్నాయి. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఓటమిపై పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ హఫీజ్ తాజాగా స్పందించాడు. ఈ పరాజయానికి ఏ ఒక్కడినో బాధ్యులను చేయలేమని చెప్పాడు. కేప్టెన్ బాబర్ ఆజమ్‌ను విమర్శించలేమని స్పష్టం చేశాడు. బాబర్ ఆజమ్ ఓ బలి పశువుగా మారాడని, అతణ్ని విమర్శించడం పట్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని పేర్కొన్నాడు. బాబర్ కెప్టెన్సీలో లోపాలను మాత్రమే చూడాల్సిన అవసరం లేదని, అతని కేరీర్‌లో టీ20 ప్రపంచకప్ మూడో అతిపెద్ద టోర్నమెంట్ అని గుర్తు చేశాడు.

అనుభవం అతనికి అన్నీ నేర్పుతుందని భావిస్తున్నట్లు మహ్మద్ హఫీజ్ చెప్పాడు. 32 ఏళ్ల వయస్సు వచ్చేసరికి బాబర్ ఆజమ్ అన్నింటినీ నేర్చుకుంటాడని పేర్కొన్నాడు. ఆదివారం భారత్-పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో 7వ ఓవర్ నుంచి 11వ ఓవర్‌ మధ్య బాబర్ ఆజమ్ స్పిన్నర్ల కోటాలను పూర్తి చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. 31 పరుగులకు భారత్ నాలుగు వికెట్లను కోల్పోయి- కష్టాల్లో పడినప్పుడు బాబర్ స్పిన్నర్ల చేతికి బంతిని అందించి ఉండాల్సిందని, మిడిల్ ఓవర్లల్లో కోటా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించాడు.

Pakistan captain Babar Azams leadership is like sacred cow, says Mohammad Hafeez

చివరి మూడు ఓవర్లలో భారత్‌కు 48 పరుగులు అవసరమైనప్పుడు ఎడమచేతి వాటం స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌ను బరిలో దించడం సరైన నిర్ణయం కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు హఫీజ్ పేర్కొన్నాడు. ఆఖరి ఓవర్‌కు ముందు పాకిస్తాన్ పేసర్లపై విరాట్ కోహ్లీ-హార్దిక్ పాండ్యా ద్వయం తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చిందని గుర్తుచేశాడు. షహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్‌పై విరాట్ కోహ్లీ కౌంటర్ అటాక్ చేయడమే దీనికి నిదర్శనమని చెప్పాడు.

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. టీమిండియా మాజీ కేప్టెన్, బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీ- ఈ మ్యాచ్‌లో విశ్వరూపాన్ని చూపాడు. ఓటమి కోరల్లో ఉన్న జట్టును గెలుపుబాట పట్టించాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు ఒంటిచేత్తో గెలుపుబాట పట్టించాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

చివరి మూడు ఓవర్లలో భారత్‌కు 48 పరుగులు అవసరమైనప్పుడు ఎడమచేతి వాటం స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌ను బరిలో దించడం సరైన నిర్ణయం కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు హఫీజ్ పేర్కొన్నాడు. ఆఖరి ఓవర్‌కు ముందు పాకిస్తాన్ పేసర్లపై విరాట్ కోహ్లీ-హార్దిక్ పాండ్యా ద్వయం తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చిందని గుర్తుచేశాడు. షహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్‌పై విరాట్ కోహ్లీ కౌంటర్ అటాక్ చేయడమే దీనికి నిదర్శనమని చెప్పాడు.

Story first published: Tuesday, October 25, 2022, 15:54 [IST]
Other articles published on Oct 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+