Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పర్సనల్‌గా ఎటాక్ చేయడం నన్ను బాధించింది.. మాజీ పాక్ క్రికెటర్ల వ్యాఖ్యలను పట్టించుకోనన్న బాబర్ ఆజామ్

Pakistan Captain Babar Azam Felt sorrow for Personal Attacks By Former Players

తన స్ట్రైక్‌రేట్ గురించి, ఫామ్‌ గురించి వచ్చిన విమర్శలపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తన మౌనం వీడాడు. టీ20 ప్రపంచకప్‌ ముంగిట బాబర్ ఆజామ్ కాస్త ఫామ్ కోల్పోయినట్లు కన్పించాడు. ఆసియాకప్‌లో బాబర్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఇక బాబర్ ఆజామ్ కెప్టెన్సీ, ఆట గురించి షోయబ్ అక్తర్, ఆకిబ్ జావెద్ తదితర మాజీ ప్లేయర్లు తీవ్ర విమర్శలు చేశాడు. బాబర్ మీద వ్యక్తిగతంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఇంగ్లాండ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు బాబర్ ఆజామ్ మాజీ ప్లేయర్లు తన మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చాలా బాధించిందని తెలిపాడు.

'మాజీ ప్లేయర్లు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు. కానీ నిరాశపరిచేది ఏంటంటే పర్సనల్ ఎటాక్స్. మాజీ ప్లేయర్లు గతంలో వాళ్లు ఇలాంటి పర్సనల్ ఎటాక్స్ ఎదుర్కొనే ఉంటారు.. అయినా కూడా వాళ్లు ప్రస్తుతం మా మీద పర్సనల్ ఎటాక్స్ చేయడం జీర్ణించుకోలేకపోతున్నా. మాపై ఎంత ఒత్తిడి, బాధ్యత ఉంటుందో వాళ్లకు తెలుసు.

అయినప్పటికీ నేను వ్యక్తిగతంగా అలాంటి ప్రకటనల గురించి ఎక్కువగా ఆలోచించను. ఇలాంటి ప్రకటనలు నన్ను ఏమాత్రం ప్రభావితం చేయవు' అని మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆజామ్ చెప్పాడు. అన్నింటినీ సింపుల్‌గా తీసుకుని తన మీద తాను విశ్వాసం పెంచుకుంటే తాను పేలవ ఫామ్ నుండి బయటపడతాడనని చెప్పుకొచ్చాడు.

'ఈ సిరీస్ నాకు వ్యక్తిగతంగా చాలా కీలకమైంది. నేను నా ఫామ్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తా. ఈ కఠినమైన పాచ్ నుండి బయటపడటానికి.. అతిగా ఆలోచించకుండా, విషయాలను సింపుల్‌గా ఉంచడం కీలకం. ప్రధాన విషయం ఏమిటంటే మీపై మీరు నమ్మకం ఉంచుకోవాలి. నేను గతంలో బాగా ఆడాను. భవిష్యత్తులో కూడా బాగా ఆడతానని నాకు తెలుసు. మీరు ఎంత బాగా ఆడినా కొందరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలన్నింటినీ విని వదిలేయడం ఉత్తమం' అని బాబర్ పేర్కొన్నాడు. టీ20ప్రపంచకప్‌కు ముందు తమ టాపార్డర్‌ను చక్కదిద్దుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది.

Story first published: Tuesday, September 20, 2022, 15:30 [IST]
Other articles published on Sep 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+