పాకిస్థాన్ కెప్టెన్ అజహర్ అలీపై ఒక మ్యాచ్ సస్పెన్షన్
హైదరాబాద్: స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ కెప్టెన్ అజహర్ అలీపై ఐసీసీ ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. ఐదు వన్డేల సిరిస్‌లో చివరిదైన అడిలైడ్ వన్డేలో స్లో ఓవర్ రేట్‌కు కారణమైనందుకు గాను అతనికి మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
దీంతో పాటు జట్టులోని మిగతా ఆటగాళ్లకు 20 శాతం జరిమానా విధించింది. గత పన్నెండు నెలల కాలంలో అజహర్ అలీ రెండు సార్లు స్లో ఓవర్ రేట్‌కు కారణం కావడంతో అతనిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ తో పాటు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

గతేడాది జనవరి 31వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేశాడు. అప్పుడు అజహర్ పై 20 శాతం జరిమానాతో సరిపెట్టింది. ఇక ఏడాదిలోపు రెండు సార్లు స్లో ఓవర్ రేటుని నమోదు చేయడంతో అజహర్‌ను ఒక మ్యాచ్ నుంచి సస్సెండ్ చేశారు.
అడిలైడ్ వన్డేలో ఆన్ ఫీల్డ్ అంపైర్లు సైమన్ ప్రే, షాముద్దీన్‌తో పాటు థర్డ్ అంపైర్ క్రిస్ గాఫెన్రీ, ఫోర్త్ అంఫైర్ శామ్ నాగస్కీలు సంయుక్తంగా అజహర్‌పై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ తాజా నిర్ణయంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనే అవకాశాన్ని అజహర్ కోల్పోనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications