న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వరల్డ్‌కప్: భారత్‌పై గెలిచి చరిత్ర సృష్టిస్తాం: పాక్ మాజీ కెప్టెన్

MoinKhan Has Expressed His Opinion On Ind vs Pak World Cup Match | Oneindia Telugu
Pakistan can make history by defeating India in World Cup: Former skipper Moin Khan

హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో ఇండియాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తామని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటవరకు జరిగిన వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాపై పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆరు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో భారత్-పాకిస్థాన్ తలపడగా అన్నింటిలోనూ భారత క్రికెట్ జట్టే విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం ఆ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించే సత్తా ప్రస్తుత పాకిస్థాన్ జట్టుకు ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ వెల్లడించాడు.

2032 ఒలింపిక్స్‌: ఉమ్మడిగా బిడ్డింగ్ దాఖలు చేయనున్న కొరియన్లు2032 ఒలింపిక్స్‌: ఉమ్మడిగా బిడ్డింగ్ దాఖలు చేయనున్న కొరియన్లు

మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ప్రారంభం

మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ప్రారంభం

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జరగబోయే వరల్డ్‌కప్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య జూన్ 16న మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా జీటీవికి ఇచ్చిన ఇంటర్యూలో మొయిన్ ఖాన్ మాట్లాడుతూ "ప్రస్తుత పాకిస్థాన్ టీమ్‌లో నైపుణ్యానికి కొదవలేదు. సర్ఫరాజ్ అహ్మద్ టీమ్‌ను అద్భుతంగా మార్చాడు. ఇండియాపై వరల్డ్‌కప్ మ్యాచ్‌లో గెలిచే సత్తా ఈ టీమ్‌కు ఉంది" అని చెప్పాడు.

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమి

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమి

1992, 1999 వరల్డ్‌కప్‌లలో భారత్‌తో ఆడిన పాక్ జట్టులో మొయిన్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. రెండేళ్ల కిందట ఇంగ్లాండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాక్ చిత్తుగా ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా మొయిన్ ఖాన్ గుర్తు చేశాడు. జూన్‌లో ఇంగ్లాండ్ పరిస్థితులకు తగినట్లు పాకిస్థాన్ జట్టులో మంచి బౌలర్లు ఉన్నారని మొయిన్ అన్నాడు.

మూడు వారాల ముందే ఇంగ్లాండ్‌కు వెళ్లనున్న పాక్

మూడు వారాల ముందే ఇంగ్లాండ్‌కు వెళ్లనున్న పాక్

పైగా మూడు వారాల ముందే ఇంగ్లాండ్ వెళ్లి ప్రాక్టీస్ మొదలు పెట్టనుండటం కూడా పాకిస్థాన్‌కు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. మే, జూన్ నెలల్లో ఇంగ్లండ్ పిచ్‌లలో తేమ ఉంటుందని, అది పాక్ బౌలర్లకు అనుకూలిస్తుందని మొయిన్ ఖాన్ వెల్లడించాడు.

Story first published: Wednesday, February 13, 2019, 14:41 [IST]
Other articles published on Feb 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X