Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన పాకిస్తాన్!

PAK vs BAN: ఆసియా కప్ 2025లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరిగింది. ఈ కీలక సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించి.. సెప్టెంబర్ 28న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓ ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. కానీ బంగ్లాదేశ్ జట్టును 124 పరుగులకే కట్టడి చేయగలిగింది. ఈ తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌ను గెలవడం ద్వారా పాకిస్తాన్ దుబాయ్ లో ఓ పెద్ద రికార్డును నెలకొల్పింది.

న్యూజిలాండ్ 7 ఏళ్ల రికార్డు బద్దలు
దుబాయ్ లోని బౌలర్‌కు అనుకూలమైన ట్రాక్‌పై మరోసారి పాకిస్తాన్ బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. దుబాయ్‌లో రెండు పూర్తి సభ్య దేశాల మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఇంత తక్కువ స్కోరును ఇంతకు ముందు ఎప్పుడూ కాపాడుకోలేదు. దీంతో 135 పరుగుల అతి తక్కువ స్కోరను విజయవంతంగా కాపాడుకున్న ప్రపంచ రికార్డును పాకిస్తాన్ తన పేరుపై నమోదు చేసుకుంది. దీనికి ముందు 2018లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ 144 పరుగుల స్కోరును కాపాడుకున్న రికార్డు ఉండేది.

Pakistan Breaks 7-Year World Record Successfully Defends Lowest T20I Target in Dubai History

టీ20 ఆసియా కప్‌లో విజయవంతంగా కాపాడుకున్న అతి తక్కువ స్కోర్లు
*129/8 - శ్రీలంక vs యూఏఈ, మీర్‌పూర్, 2016
*33/8 - బంగ్లాదేశ్ vs యూఏఈ, మీర్‌పూర్, 2016
*135/8 - పాకిస్థాన్ vs బంగ్లాదేశ్, దుబాయ్, 2025*
*146/9 - పాకిస్థాన్ vs యూఏఈ, దుబాయ్, 2025
*147/7 - బంగ్లాదేశ్ vs శ్రీలంక, మీర్‌పూర్, 2016

టీ20లలో పాకిస్తాన్ విజయవంతంగా కాపాడుకున్న అతి తక్కువ స్కోర్లు
*122/6 vs శ్రీలంక, హంబన్‌టోట, 2012
*132 vs వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 2017
*134/8 vs న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్, 2024
*135/8 vs బంగ్లాదేశ్, దుబాయ్, 2025*
*135/7 vs బంగ్లాదేశ్, మీర్‌పూర్, 2011

Story first published: Friday, September 26, 2025, 11:16 [IST]
Other articles published on Sep 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+