For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా బౌలింగ్‌లో సిక్స్ కొడతావా: పాక్ బౌలర్ అఫ్రిది కడుపుమంట: క్రీజ్‌లో కుప్పకూలిన బ్యాటర్

Pakistan bowler Shaheen Afridi loses cool after being hit for six, hits Afif Hossain with a throw

ఢాకా: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై జరుగుతున్న రెండో టీ20లోనూ జయకేతనాన్ని ఎగరవేసింది. మూడు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో సాధించిన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌ తరహాలోనే బంగ్లాదేశ్ ఏ మాత్రం పోరాడకుండా చేతులెత్తేసింది. నామమాత్రపు టార్గెట్‌ను ప్రత్యర్థికి నిర్దేశించింది. దీన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది పాకిస్తాన్.

నామమాత్రపు లక్ష్యం..

నామమాత్రపు లక్ష్యం..

రాజధాని ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్స్‌లో మరోసారి పాకిస్తాన్ చేతిలో పరాభవాన్ని చవి చూసింది బంగ్లాదేశ్. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులే చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఈ విక్టరీతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ పాక్ వశమైంది.

 ఫర్వాలేదనిపించుకున్న నజ్ముల్

ఫర్వాలేదనిపించుకున్న నజ్ముల్

వన్‌డౌన్ బ్యాటర్ నజ్ముల్ హొస్సెయిన్ శాంటో కొంత ఫర్వాలేదనిపించుకున్నాడు. 34 బంతుల్లో అయిదు ఫోొర్లతో 40 పరుగులు చేశాడు. అతనికి అఫీఫ్ హొస్సెన్ సహకారాన్ని అందించాడు. అఫీఫ్ 21 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉన్నాయి. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద ఉన్నప్పుడు అఫీఫ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన బ్యాటర్లెవరూ నిలదొక్కుకోలేదు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేప్టెన్ మహ్మదుల్లా 12, నారుల్ హసన్ 11, మెహదీ హసన్ 3 పరుగులు చేశారు.

 అఫీఫ్ కొట్టిన సిక్స్‌కు..

అఫీఫ్ కొట్టిన సిక్స్‌కు..

ఈ మ్యాచ్‌లో షహెన్ షా అఫ్రిది తన కోపాన్ని, అక్కసును అదుపులో పెట్టుకోలేకపోయాడు. బ్యాటర్‌పైకి బంతిని బలంగా విసిరి.. తన ఆగ్రహాన్ని బయటపెట్టుకున్నాడు. బంతి తగలడంతో అఫీఫ్ క్రీజ్‌లోనే కుప్పకూలిపోయాడు. పాకిస్తాన్ ఫీల్డర్లు, అఫ్రిది అతణ్ని పైకి లేపాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఫ్రిదిపై విమర్శలకు కారణమైంది. వికెట్లను తీయడంలో అగ్రెసివ్‌నెస్‌ను ప్రదర్శించాలని, శరీరం మీద కాదని మండిపడుతున్నారు.

ఇన్నింగ్ మూడో ఓవర్‌లో..

ఇన్నింగ్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయిదు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగాడు అఫీఫ్. అతను క్రీజ్‌లోకి వచ్చే సరికి రెండు ఓవర్లలో అయిదు పరుగులు మాత్రమే చేసింది బంగ్లాదేశ్. రెండు వికెట్లను కోల్పోయింది. ఆ ఓవర్ రెండో బంతికి భారీ సిక్స్ బాదాడు అఫీఫ్. అతను కొట్టిన ఒకే ఒక్క సిక్స్.. అఫ్రిదీ బౌలింగ్‌లో వచ్చినదే. వస్తూనే అఫ్రిది బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ పట్ల అఫ్రిది ముఖం ఎర్రగా మారింది. మూడో బంతిని అఫీఫ్ డిఫెన్స్ ఆడాడు. బంతిని అందుకున్న అప్రిది.. దాన్ని బలంగా అఫీఫ్‌పైకి విసిరాడు. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కుదర్లేదు. నేరుగా ఆ బాల్ అతణ్ని బలంగా తాకింది. దీనితో క్రీజ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే కీపర్, అఫ్రిది, ఇతర ఫీల్డర్లు అతణ్ని పైకి లేపారు.

పాకిస్తాన్ బౌలర్ల ధాటికి..

పాకిస్తాన్ బౌలర్ల ధాటికి..

తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఏ దశలో కూడా పాకిస్తాన్ బౌలర్లను ఎదురునిలవలేకపోయింది. తొలి ఓవర్‌లోనే వికెట్‌ను కోల్పోయింది. పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహెన్ షా అఫ్రిది సంధించిన ఆ ఓవర్ అయిదో బంతికి ఓపెనర్ సయీఫ్ హసన్ బలి అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికి బంగ్లాదేశ్ జట్టు స్కోరు ఒక్క పరుగే. రెండో ఓవర్ చివరి బంతికీ వికెట్ పడింది. మరో ఓపెనర్ మొహమ్మద్ నయీం ఫకర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ వికెట్ మహ్మద్ వసీం ఖాతాలో చేరింది.

Story first published: Saturday, November 20, 2021, 18:42 [IST]
Other articles published on Nov 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+