ఇంగ్లండ్ క్రికెట్‌లోని జాతి, మత వివక్షతో చావాలనుకున్నా: పాక్ సంతతి క్రికెటర్

లండన్: ఇంగ్లండ్‌కు చెందిన యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌లో జాత్యహంకారం ఎక్కువని ఆ జట్టు మాజీ కెప్టెన్, పాకిస్థాన్ సంతతి క్రికెటర్ అజీమ్ రఫీఖ్ అన్నాడు. ఆ వివక్ష కారణంగా తాను ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఈ ఇంగ్లండ్ మాజీ అండర్-19 కెప్టెన్ చెప్పుకొచ్చాడు. క్లబ్‌కు ఆడే క్రమంలో తాను అడుగడుగున రంగు, మతం, జాతి పేరిట వివక్ష ఎదుర్కొన్నానని తెలిపాడు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలనే కుటుంబ కలను సాకారం చేయాలనుకున్న తనకు క్లబ్‌లో అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయన్నాడు. దాంతో తాను లోలోపలే ఎంతో కుమిలిపోయేవాడినని ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టులో అతని వర్గానికి చెందిన అధికారులు, ఆటగాళ్లు, కోచ్‌లు లేకపోవడంతో తన బాధ ఎవరికి అర్థమయ్యేది కాదని తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 మానసికంగా చనిపోయా..

మానసికంగా చనిపోయా..

‘యార్క్‌షైర్‌కు ఆడే క్రమంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే నా ఫ్యామిలీ కల కోసం జీవిస్తున్నా. కానీ మానసికంగా ఎప్పుడో చనిపోయా. అయినా మనసు చంపుకొని క్రికెట్ ఆడేవాడిని. ప్రతీ రోజు చాలా బాధగా ఉండేది. ఓ ముస్లింగా ఆ రోజులను తలుచుకొని పశ్చాతాపపడుతున్నా. గర్వించడానికి కూడా అక్కడేం లేదు. నా వర్గానికి చెందిన కోచ్‌లు, స్టాఫ్ ఉంటే నా బాధ వారికి అర్థమయ్యేది'అని తెలిపాడు.

 జాతి వైవిధ్యమంటూ ప్రగల్బాలే..

జాతి వైవిధ్యమంటూ ప్రగల్బాలే..

యార్క్‌షైర్ నగరం జాతి వైవిధ్యాయానికి నిలయమని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ.. యార్క్‌షైర్ క్లబ్ మాత్రం ఆసియా ఆటగాళ్లను సహించిదని, క్లబ్‌లో జాత్యహంకారం పెచ్చరిల్లుతుందని రఫీక్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘నిజనిజాలు మాట్లాడుకుంటే.. జట్టు ఫొటోగ్రాఫ్, కోచ్‌లలో ఎంత మంది నాన్ ఇంగ్లీష్ వాళ్లను చూసారు? యార్క్‌షైర్‌లోని నగరాలు మాత్రం జాతి వైవిధ్యాయానికి నిలయాలని ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఆసియా వర్గాలను మాత్రం సహించరు. ఎంత మంది ఆసియా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.? పరిశీలిస్తే సమస్య ఉందని మీకే స్పష్టం అవుతుంది. ఇది సంస్థాగతంగానే జరుగుతుందని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయపం ప్రకారం జట్టులో జాతి వివక్ష గతంలో కంటే ఘోరంగా ఉంది.'అని పేర్కొన్నాడు.

మార్పుకు అంగీకరించదు..

మార్పుకు అంగీకరించదు..

జట్టులో జరుగుతున్న వాస్తవాన్ని యార్క్‌షైర్ క్లబ్ యాజమాన్యం గ్రహించదని, మార్పుకు కూడా వారు అస్సలు అంగీకరించరన్నాడు. ఇది ముమ్మాటి సంస్థాగతంగా జరుగుతుందేనని ఆరోపించాడు. క్లబ్‌కు దూరమైన తాను.. తనలా మరెవరూ అవమానాలకు గురికావద్దని, ఆత్మహత్య ఆలోచనలు రావద్దనే ఈ విషయాలు చెబుతున్నట్లు స్పష్టం చేశాడు. ‘యార్క్ షైర్ సూచనలను పట్టించుకోదు. మార్పుకు అంగీకరించదు. ఎందుకంటే జట్టులో భాగమైన వారంత తెల్లజాతీయులే. నాలా ఎవరు బాధపడవద్దని ఇదంతా చెబుతున్నా. నేనేం చేస్తున్నానో.. మరేం మాట్లాడుతున్నానో.. ఇలాంటి వ్యాఖ్యలతో నేనెంత నష్టపోతానో కూడా తెలుసు. నాకు మళ్లీ అవకాశాలు రావని కూడా తెలుసు. కానీ నేను మాట్లాడేదే సరైంది'అని చెబుతూ రఫీఖ్ ముగించాడు. ఇక 2018లో యార్క్‌షైర్ క్లబ్‌ను వీడిన అజీమ్ రఫీఖ్ అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు.

విరాట్ కోహ్లీని కొనియాడితే మీకు వచ్చిన నొప్పేంటి..? విమర్శకులపై షోయబ్ అక్తర్ ఫైర్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, September 3, 2020, 15:30 [IST]
Other articles published on Sep 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X