Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రతీకారం తీర్చుకున్న పాక్, 16పరుగులకే పరిమితమైన పించ్

 Pakistan beats Australia by 45 runs in T20 tri-series

హైదరాబాద్: గత మ్యాచ్ వైఫల్యంతో.. బరిలోకి దిగిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 రన్స్ చేసింది. బదులుగా ఆసీస్ 149 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి సరైన బదులిచ్చింది.

పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఫకార్ జమాన్ 42 బంతుల్లో 73 పరుగులు చేయగా.. హుస్సేన్ తలాత్ (25), షోయబ్ మాలిక్ (27), అసిఫ్ అలీ (18 బంతుల్లో 37) రాణించారు. దీంతో పాకిస్థాన్ 194 పరుగులు చేసింది. టీ20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో తానొక్కడే 172పరుగుల వరకూ బాదిన పించ్.. ఈ మ్యాచ్‌లో కేవలం 15పరుగులు మాత్రమే చేయగలిగాడు. 75 పరుగులకే ఆ జట్టు ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. కెరీర్లో రెండో అంతర్జాతీయ టీ20 ఆడుతున్న పాక్ అండర్-19 జట్టు బౌలర్ షాహిన్ అఫ్రిదీ 3 వికెట్లతో సత్తా చాటాడు. గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో సత్తా చాటిన ఆరోన్ ఫించ్‌తోపాటు గ్లేన్ మ్యాక్స్‌వెల్‌లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు.

పాక్ బౌలర్లు రాణించడంతో కంగారూలు ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. వరుస వికెట్లు పడిపోతుండటంతో.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ గందరగోళానికి గురైంది. చివర్లో అలెక్సీ కేరీ (24 బంతుల్లో 37 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఆస్ట్రేలియా జింబాబ్వేతో తలపడనుంది.

Story first published: Thursday, July 5, 2018, 19:42 [IST]
Other articles published on Jul 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+