క్వార్టర్స్ ఆశలు సజీవం: సఫారీలను చిత్తు చేసిన పాక్
అక్లాండ్: ప్రపంచకప్ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు 47 ఓవర్లకు కుదిరించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ 46.4 ఓవర్లకు 222 పరుగులు చేసి ఆలౌటైంది.
డక్‌వర్త్ లుయీస్ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 47 ఓవర్లలో 232 పరుగులుగా నిర్దేశించారు. లక్ష్యఛేదనలో తడబడిన సఫారీ జట్టు 33.3 ఓవర్లలోనే 202 పరుగులకే ఆలౌటైంది. కాగా, ఈ గెలుపుతో పాకిస్థాన్ క్వార్టర్స్ ఆశలు సజీవమయ్యాయి.
సౌతాఫ్రికా కెప్టెన్ ఏబి డివిల్లీర్స్ 77 (58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. సఫారీలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకనే ఇన్నింగ్స్ రెండో బంతికి ఓపెనర్ డికాక్ అవుటయ్యాడు.

ఆ తర్వాత ఆమ్లా (38), డుప్లెసిస్ (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 67 పరుగులు జోడించడంతో సఫారీలు గాడిలో పడినట్టు కనిపించింది. అయితే రహత్ అలీ బౌలింగ్ లో డుప్లెసిస్ అవుటవడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి.
మరుసటి ఓవర్లో ఆమ్లా వెనుదిరిగాడు. ఆ తర్వాత రోసో, మిల్లర్, డుమిని, స్టెయిన్ వెంటవెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత డివిల్లీర్స్ ఒంటరి పోరాటం చేసి జట్టును విజయం అంచుల వరకు తీసుకెళ్లాడు. కాగా, సొహైల్ ఖాన్ బౌలింగ్‌లో డివిలియర్స్ ఔటవడంతో సౌతాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. ఇమ్రాన్ తాహిర్ పెవిలియన్ చేరడంతో పాక్ విజయం ఖాయమైంది. పాక్ బౌలర్లు ఇర్ఫాన్, రహత్ అలీ, రియాజ్ మూడేసి వికెట్లు తీశారు.
కాగా, ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిస్బా (56) హాఫ్ సెంచరీకి తోడు ఓపెనర్ సర్ఫరాజ్ (49) రాణించారు. దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్ 3 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications