Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీలాగా ఎదగాలని ఉంది: పాక్ బ్యాటింగ్ సెన్సేషన్ బాబర్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలాగా ప్రపంచ క్రికెట్‌లో తాను విజయవంతమవ్వాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్‌ అజామ్ తన కోరికను వెల్లడించాడు. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి ట్రైనింగ్‌ క్యాంపులో పాల్గొన్న బాబర్‌ మీడియాతో పైవిధంగా మాట్లాడాడు.

కోహ్లీలాగా తాను ఆడకపోయినా, తన బ్యాటింగ్‌ శైలి కోహ్లికి భిన్నంగా ఉన్నప్పటికీ అతని లాగా జట్టు కోసం విజయవంతమైన ఇన్నింగ్స్‌ ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. 'నేను అతడిలా ఆడను. మా బ్యాటింగ్‌ శైలులు వేరు. అయితే తన జట్టు కోసం విజయవంతమైన కోహ్లీలా నేనూ అవ్వాలని కోరుకొంటున్నాను. మా జట్టు అత్యుత్తమ ప్రదర్శనల్లో భాగమవ్వాలని భావిస్తున్నా. అవసరమైనప్పుడు పరుగులు సాధించాలనుకొంటున్నాను. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అందుకు తగిన విధంగా సిద్ధం అవుతున్నా' అని అన్నాడు.

Pakistan batting sensation Babar Azam wants to emulate Virat Kohli

వెటరన్లు యూనిస్‌ ఖాన్, మిస్బావుల్‌ హక్‌ రిటైరైన తర్వాత వారిస్థానంలో జట్టులో పాతకుపోవడాని ఎదురు చూస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. 22 ఏళ్ల బాబర్‌‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. మొత్తంగా 23 వన్డేలు ఆడిన బాబర్‌ 53 యావరేజితో నాలుగు సెంచరీలు చేశాడు. మరోవైపు నాలుగు టీ20లు, నాలుగు టెస్టులు కూడా ఆడిన అనుభవం ఉంది. పాకిస్థాన్ హెడ్ కోచ్‌ మికీ ఆర్ధర్‌ బాబర్‌లోని టాలెంట్‌ని కోహ్లీతో పోల్చిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+