Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ కేప్టెన్ బాబర్ ఆజమ్‌కు అవమానం: ఆ లీగ్‌లో అమ్ముడుపోని వైనం: ఐపీఎల్ స్టార్లకు డిమాండ్

Pakistan batters Babar Azam and Rizwan have gone Unsold in the Hundred league 2022
The Hundred 2022 Draft: David Warner, Babar Azam Unsold | Oneindia Telugu

లండన్: హండ్రెడ్ లీగ్ 2022 మెగా క్రికెట్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ జాయింట్‌గా దీన్ని నిర్వహించనున్నాయి. ఎనిమిది జట్లు ఇందులో పాల్గొనబోతున్నాయి. ఆయా ఫ్రాంఛైజీలన్నీ తమ స్క్వాడ్లను రూపొందించుకున్నాయి. ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న స్టార్లతో పాటు పలువురు జూనియర్లకూ ఇందులో అవకాశం లభించింది. ఐపీఎల్‌లో ఆడుతున్న పలువురు క్రికెటర్లకు ఇందులో ఈ హండ్రెడ్ లీగ్ 2022 ఫ్రాంఛైజీల్లో చోటు దక్కింది.

వంద బంతుల ఫార్మట్..

వంద బంతుల ఫార్మట్..

వంద బంతుల ఫార్మట్‌లో సాగే టోర్నమెంట్ ఇది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కారణంగా రెండు సంవత్సరాల పాటు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడా పరిస్థితులు లేకపోవడంతో మళ్లీ తెరమీదికి వచ్చిందీ ధనాధన్ టోర్నమెంట్. మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొంటోన్నాయి. త్వరలో ఈ సిరీస్ ఆరంభం కాబోతోంది. దీనికోసం ఫ్రాంఛైజీలు మన ఐపీఎల్‌లాగే మెగా వేలంపాటను నిర్వహించాయి. జట్టును సమకూర్చుకున్నాయి.

అమ్ముడుపోని బాబర్ ఆజమ్

అమ్ముడుపోని బాబర్ ఆజమ్

ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ కేప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఈ సిరీస్ కోసం అమ్ముడుపోలేదు. అతని ఓపెనింగ్ పార్ట్‌నర్ మహ్మద్ రిజ్వాన్‌కు కూడా చుక్కెదురైంది. ఏ ఫ్రాంఛైజీ కూడా వారిద్దరినీ తమ జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఆస్ట్రేలియాపై సిరీస్‌లో బాబర్ ఆజమ్ అద్భుతంగా రాణించాడు. సెంచరీలు నమోదు చేశాడు. ఆధునిక పాకిస్తాన్ క్రికెట్‌కు దిశానిర్దేశం చేశాడు. అతన్ని పాకిస్తాన్ విరాట్ కోహ్లీగా భావిస్తుంటుంది క్రికెట్ ప్రపంచం. అలాంటి బ్యాటర్‌ అమ్ముడుపోకపోవడం హాట్ డిబేట్‌గా మారింది.

డేవిడ్ వార్నర్‌ కూడా..

డేవిడ్ వార్నర్‌ కూడా..

వారిద్దరితో పాటు డేవిడ్ వార్నర్ కూడా అమ్ముడుపోలేదు. ఈ ఆస్ట్రేలియన్ డైనమిక్ ఓపెనర్ ప్రస్తుతం ఐపీఎల‌్‌ 2020 సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇదివరకు సుదీర్ఘకాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అసోసియేట్ అయి ఉన్నాడు. ఆ టీమ్ ఫ్రాంఛైజీ అతన్ని విడుదల చేయడంతో మెగా వేలంపాటలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఢిల్లీ కేపిటల్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది.

 ఐపీఎల్ స్టార్లకు భారీ డిమాండ్..

ఐపీఎల్ స్టార్లకు భారీ డిమాండ్..

పవర్ హిట్టింగ్‌కు మారుపేరుగా ఉన్న కీరన్ పొల్లార్డ్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్క్‌ వుడ్, జోస్ బట్లర్, సామ్ బిల్లింగ్స్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, మార్కస్ స్టొయినిస్, రషీద్ ఖాన్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టొన్, ఆడమ్ మిల్నే.. భారీ మొత్తానికి అమ్ముడుపోయారు. వీరంతా ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్‌తో తీరిక లేకుండా గడుపుతున్నారు. భారత క్రికెటర్లెవరూ ఇందులో పాల్గొనట్లేదు.

జట్ల వివరాలివీ..

జట్ల వివరాలివీ..

లండన్ స్పిరిట్స్‌లో జేక్ క్రాలీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మేసన్ క్రేన్, ఆడమ్ రొస్సింగ్టన్, బ్లేక్ కల్లెన్, మార్క్‌వుడ్, ఇవాన్ మోర్గాన్, డాన్ లారెన్స్, రవి బొపారా, బ్రాడ్ వీల్ ఉన్నారు. మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో- కొలిన్ యాక్కర్‌మన్, జోస్ బట్లర్, కెల్విన్ హ్యారిసన్, టామ్ హార్ట్‌లే, ఫ్రెడ్ క్లాసెన్, టామ్ లామ్మోన్‌బై, వేన్ మ్యాడ్సెన్, జేమీ ఓవర్‌టన్, మ్యాట్ పార్కిన్సన్, ఒల్లె రాబిన్సన్, ఫిల్ సాల్ట్ చేరారు.

మార్కస్ స్టోయినిస్, రషీద్ ఖాన్..

మార్కస్ స్టోయినిస్, రషీద్ ఖాన్..

ఓవల్ ఇన్విజిబుల్స్ జట్టులో సామ్ బిల్లింగ్స్, రోరీ బర్న్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, విల్ జాక్స్, షకీబ్ మహ్మద్, జేసన్ రాయ్, నాథన్ సౌటర్, రీస్ టోప్లే జాయిన్ అయ్యారు. సదరన్ బ్రేవ్ టీమ్‌లో- జోఫ్రా ఆర్చర్, టిమ్ డేవిడ్, అలెక్స్ డేవిస్, జార్జ్ గార్టన్, క్రిస్ జోర్డాన్, జేక్ లింటోట్, టైమల్ మిల్స్, క్రెయిగ్ ఓవర్టన్, మార్కస్ స్టోయినిస్, జేమ్స్ విన్స్, రాస్ వైట్లీలకు చోటు దక్కింది. ట్రెంట్ రాకెట్స్ టీమ్‌లో- మాట్ కార్టర్, సామ్ కుక్, మర్చంట్ డి లాంగే, లూయిస్ గ్రెగొరీ, అలెక్స్ హేల్స్, రషీద్ ఖాన్, డేవిడ్ మలన్, టామ్ మూర్స్, స్టీవెన్ ముల్లానీ, సమిత్ పటేల్, జో రూట్, ల్యూక్ వుడ్‌లు ఉన్నారు.

 జానీ బెయిర్‌స్టో.. మొయిన్ అలీ..

జానీ బెయిర్‌స్టో.. మొయిన్ అలీ..

వేల్స్ ఫైర్స్‌ ఫ్రాంఛైజీలో జేక్ బాల్, జానీ బెయిర్‌స్టో, జోష్ కాబ్, మాట్ క్రిచ్లీ, బెన్ డకెట్, ల్యూస్ డు ప్లూయ్, ర్యాన్ హిగ్గిన్స్, డేవిడ్ పేన్, ఒల్లీ పోప్ చేరారు. సూపర్ నార్తరన్ ఛార్జర్స్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ఫాఫ్ డుప్లెసిస్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, ఆడమ్ లిత్, కల్లమ పార్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, జాన్ సింప్సన్, బెన్ స్టోక్స్, డేవిడ్ మిల్లే చేరారు. బర్మింగ్ హామ్ ఫీనిక్స్ ఫ్రాంఛైజీ- మొయిన్ అలీ, టామ్ అబెల్, క్రిస్ బెంజమిన్, హెన్రీ బ్రూక్స్, మిల్స్ హమ్మోడ్, బెన్నీ హావెల్, లియామ్ లివింగ్‌స్టొన్, ఆడమ్ మిల్నె, విల్ సమీద్‌ను తీసుకుంది.

Story first published: Wednesday, April 6, 2022, 13:29 [IST]
Other articles published on Apr 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+