Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 చరిత్రలో అరుదైన ఘనత.. నాలుగో బ్యాట్స్‌మన్‌గా మాలిక్‌ రికార్డు

Pakistan batsman Shoaib Malik hits 9000 T20 runs as Guyana Amazon Warriors beat Barbados Tridents

గయానా: టీ20 చరిత్రలో పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా మాలిక్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో భాగంగా గయానా అమెజాన్‌ వారియర్స్‌, బార్బోడాస్‌ ట్రిడెంట్స్‌ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో 32 పరుగులు చేయడంతో మాలిక్‌ తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసాడు.

షోయబ్ మాలిక్ ఇప్పటివరకు ఆడిన 356 టీ20 మ్యాచ్‌ల్లో 9,014 పరుగులు చేశాడు. అంతేకాకుండా 142 వికెట్లు కూడా పడగొట్టాడు. టీ20 ప్రపంచ క్రికెట్‌లో తొమ్మిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న నాలుగో బ్యాట్స్‌మన్‌గా మాలిక్ నిలిచాడు. తొమ్మిదివేల పరుగుల్ని పూర్తి చేసుకున్న జాబితాలో విండీస్ బాస్ క్రిస్‌ గేల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. 394 మ్యాచ్‌ల్లో 13,051 టీ20 పరుగులు చేశాడు. బ్రెండన్ మెకల్లమ్‌ (370 మ్యాచ్‌ల్లో 9,922 పరుగులు), కీరోన్ పొలార్డ్ (489 మ్యాచ్‌ల్లో 9,757 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

బార్బోడాస్‌ ట్రిడెంట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అమెజాన్‌ వారియర్స్‌ 30 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. మొదటగా బ్యాటింగ్ చేసిన అమెజాన్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్రాండన్‌ కింగ్‌ (132 నాటౌట్‌; 72 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీ చేయగా.. చంద్రపాల్‌ మహరాజ్‌ (27) రాణించాడు. మాలిక్‌ 19 బంతుల్లో 3 సిక్సర్లతో 32 పరుగులు చేసాడు. హేడెన్ వాల్ష్ రెండు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో బార్బోడాస్‌ 188 పరుగులకే పరిమితం అయింది. జోనాథన్ కార్టర్ (49), అలెక్స్ హేల్స్ (36) పరుగులు చేశారు. రొమానో షెపర్డ్ మూడు వికెట్లు తీసాడు.

37 ఏళ్ల మాలిక్ 35 టెస్టులు, 287 వన్డేలు, 111 టీ20ల్లో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1999లో వెస్టిండీస్‌పై తొలి వన్డే ఆడిన మాలిక్‌.. చివరి వన్డే టీమిండియాపై ఆడాడు. 20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు చేసాడు. అత్యధిక స్కోర్ 143. ఇక 39.19 సగటుతో 158 వికెట్లు కూడా పడగొట్టాడు. 2010లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. మాలిక్, సానియాలకు ఓ కుమారుడు ఉన్నాడు.

Story first published: Monday, October 7, 2019, 13:56 [IST]
Other articles published on Oct 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+