Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రీజులో ప‌ల్టీ కొట్టిన‌ ఈ బ్యాట్స్‌మెన్ ఎవ‌రో చెప్పుకోగ‌ల‌రా?

ICC Cricket World Cup 2019 : Pak Batsman Haris Sohail Laid Down On The Crease,Picture Going Viral
 Pakistan Batsman Haris Sohail laid down on the crease going viral

లార్డ్స్‌: క్రీజులో ప‌ల్టీ కొడుతున్న ఈ బ్యాట్స్‌మెన్ ఫొటో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ అధికారిక ట్వీట్ట‌ర్‌లో ఈ పిక్ పోస్ట్ చేసింది ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హిస్తోన్న అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌. క్రికెట్ అభిమానులు, ప్రేమికుల మెదడుకు మేత పెట్టింది.

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా లండ‌న్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఆదివారం పాకిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య చోటు చేసుకున్న మ్యాచ్ సంద‌ర్భంగా తీసిన ఫొటో ఇది.

భారీ షాట్ ఆడ‌బోతూ ప‌ట్టుత‌ప్పి క్రీజులో జారిప‌డ్డాడా బ్యాట్స్‌మెన్‌. బ్యాట్, ప్యాడ్లు మాత్ర‌మే క‌నిపించేలా తీసిన ఈ పిక్‌ను ట్వీట్ చేసింది. గెస్ హు అనే ట్యాగ్ జోడించింది. అంతే. క్ష‌ణాల్లో ఈ పిక్ వైర‌ల్‌లా మారింది. దీనిపై అభిమానులు త‌మ‌కు తోచిన విధంగా స‌మాధానాలు ఇచ్చుకుంటున్నారు.

నిజానికి- ఇక్క‌డ ప‌ట్టు తప్పి కింద ప‌డింది హారిస్ సొహైల్‌. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో తొలి మ్యాచ్ ఆడిన సొహైల్‌.. భారీ స్కోరును చేశాడు. 59 బంతుల్లో 89 ప‌రుగులు చేశాడు. సొహైల్ బ్యాటింగ్ ప్ర‌తాపానికి పాకిస్తాన్ జ‌ట్టు సైతం భారీ స్కోరును న‌మోదు చేసింది. ద‌క్షిణాఫ్రికాకు 308 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ల‌క్ష్యాన్ని అందుకోలేక పోయింది ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు. 50 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 259 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది.

Story first published: Monday, June 24, 2019, 15:29 [IST]
Other articles published on Jun 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+