T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‍కు చెత్త రికార్డు.. ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాక్..

టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్ పేలప ప్రదర్శన చేస్తోంది. భారత్, జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు పాకిస్థాన్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేదట. ఆస్ట్రేలియాలో ఆసీస్ 34 మ్యాచ్ లు గెలిచింది. ఇండియా 9, శ్రీలంక 9, ఐర్లాండ్ 5, ఇంగ్లాండ్ 4, సౌతాఫ్రికా 3, జింబాబ్వే 3, నెదర్లాండ్స్ 2, వెస్టిండీస్ 2, బంగ్లాదేశ్, నమీబియా, న్యూజిలాండ్, పీఎన్జీ, స్కాట్లాండ్, యూఏఈ ఒక్కో మ్యాచ్ గెలవగా.. పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

భారత్ చేతిలో
ఈ టీ20 వరల్డ్ కప్ ఇప్పటి వరకు పాకిస్థాన్ రెండు మ్యాచ్ లు ఆడగా.. రెండింటిలో ఓడిపోయింది. ఈనెల 23న భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లను హర్ష్ దీప్ త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్, ఇఫ్తికార్ జట్టును ఆదుకున్నారు. షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇఫ్తికా అహ్మద్ 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు.

కింగ్ కోహ్లీ
160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ వికెట్లను కోల్పోయింది.ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. కానీ కోహ్లీ ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.
జింబాబ్వే చేతిలో
గురువారం జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. దీంతో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications