For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్నీ..నెదర్లాండ్స్‌కు కూడా లోకువైపోయిన పాకిస్తాన్ - బాబర్ సైన్యాన్ని ఓడించడం సాధ్యమే

Pakistan are beatable and weve seen that in the last match, says Netherlands coach Ryan Cook

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో ఇవ్వాళ సూపర్ సండే. మొత్తంగా మూడు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్ ఈ ఉదయం 8:30 గంటలకు మొదలవుతుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జింబాబ్వే - ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోరు ఉంటుంది. టీ20 ప్రపంచకప్ టైటిల్ హాట్ ఫేవరెట్లల్లో ఒకటైన పాకిస్తాన్‌ను ఓడించిన ఊపు మీద ఉంది జింబాబ్వే. సెమీ ఫైనల్స్ చేరుకుంటామంటూ హెడ్ కోచ్ ధీమా వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.

బెర్త్ కన్‌ఫర్మ్ అవుతుందా?

బెర్త్ కన్‌ఫర్మ్ అవుతుందా?

రెండో మ్యాచ్‌ పాకిస్తాన్- నెదర్లాండ్స్‌ మధ్య ఉంటుంది. పెర్త్‌ స్టేడియం దీనికి వేదిక. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. మూడో మ్యాచ్‌లో భారత్.. దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఇదే పెర్త్‌లో సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. తన సమవుజ్జీ, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడబోతోండటం ఆసక్తి రేపుతోంది. ఈ మ్యాచ్‌ను కూడా గెలిస్తే సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా కన్‌ఫర్మ్ అయినట్టే.

పాకిస్తాన్-నెదర్లాండ్స్‌పై..

పాకిస్తాన్-నెదర్లాండ్స్‌పై..

ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు లేకపోలేదు. దీనికి అనుగుణంగా నెదర్లాండ్స్ హెడ్ కోచ్ ర్యాన్ కుక్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్ జట్టేమీ పెద్ద శతృదుర్భేద్యం కాదని ఆయన పేర్కొన్నారు. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు ఓడిపోతుందనే విషయం- ఆ జట్టు ఆడిన చివరి రెండు మ్యాచ్‌లల్లో నిరూపితమైందని అన్నారు.

ఓడించడంపై కసరత్తు..

ఓడించడంపై కసరత్తు..

తాము కూడా ఆ దిశగా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని ర్యాన్ కుక్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్‌పై గెలవడానికి అవసరమైన గేమ్ ప్లాన్‌ను రూపొందించుకున్నామని అన్నారు. పెర్త్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ జట్టయినా తాము గెలవాలని కోరుకుంటుందని, దీనికి తాము కూడా మినహాయింపు కాదని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ జట్టు కూడా ఓడిపోతుందనే విషయాన్ని తాము గమనించామని, దీనికి అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేసుకున్నామని అన్నారు.

బౌలింగ్ అటాక్ బాగుంది..

బౌలింగ్ అటాక్ బాగుంది..

తమ జట్టు బౌలింగ్ అటాక్ బాగుందని, భారత్‌ను కూడా 179 పరుగులకే నిలువరించగలిగామని ర్యాన్ కుక్ గుర్తు చేశారు. పవర్ ప్లేలో పరుగులను కట్టడి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని వివరించారు. అదే సమయంలో ప్రారంభం, చివరి ఓవర్లల్లో వికెట్లు తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాకిస్తాన్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న అనుభవం తమ జట్టుకు ఉందని, అది ఇక్కడ ఉపయోగపడుతుంని వ్యాఖ్యానించారు.

కట్టడి చేయడంపైనే..

కట్టడి చేయడంపైనే..

పాకిస్తాన్ పేస్-స్పిన్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉందని, దీన్ని ధీటుగా ఎదుర్కొనడానికి తమ బ్యాటర్లు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. దీనిపై నెట్స్‌లో శ్రమించినట్లు ర్యాన్ కుక్ పేర్కొన్నారు. తమ రెండు జట్లు కూడా ఈ టోర్నమెంట్‌లో ఇంకా ఖాతాలను తెరవలేదని, సున్నా పాయింట్లతో మ్యాచ్‌ను మొదలు పెట్టబోతోన్నామని ర్యాన్ కుక్ అన్నారు. పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేయడం, స్వేచ్ఛగా ఆడనివ్వని పరిస్థితులను కల్పించడంపై కసరత్తు చేశామని అన్నారు.

Story first published: Sunday, October 30, 2022, 8:09 [IST]
Other articles published on Oct 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+