For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్ వీరులను ఢీ కొట్టే పాకిస్తాన్ జట్టు ఇదే: టీ20, వన్డే టీమ్‌ను ప్రకటించిన పీసీబీ

Pakistan announces the T20I and ODI squads for the home series against the West Indies

లాహోర్: వెస్టిండీస్ క్రికెట్ జట్టు బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది ఈ జట్టు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ను ఆడుతోంది. తొలి టెస్ట్‌లో లంకేయుల చేతిలో ఓడారు కరేబియన్ వీరులు. రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గాలేలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు తన రెండో ఇన్నింగ్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. మొత్తంగా 279 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఇంకో రోజు ఆట మిగిలివుంది.

సెంచరీతో కదం తొక్కిన డిసిల్వా..

సెంచరీతో కదం తొక్కిన డిసిల్వా..

రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ ధనంజయ డిసిల్వా సెంచరీతో కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్‌లో రెండు పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ.. రెండో ఇన్నింగ్‌లో వెస్టిండీస్ బౌలర్ల దుమ్ము దులుపుతున్నాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి అతను 153 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి టెస్ట్‌లోనూ అతను సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌ను వెస్టిండీస్ నిలుపుకొంటుందా? లేదా? అనేది చివరి రోజు తేలిపోనుంది.

విండీస్.. పాకిస్తాన్ ప్రయాణం..

విండీస్.. పాకిస్తాన్ ప్రయాణం..

కాగా- ఈ సిరీస్ ముగిసిన వెంటనే వెస్టిండీస్ జట్టు.. పాకిస్తాన్‌కు ప్రయాణం కడుతుంది. పాకిస్తాన్‌లో పర్యటిస్తుంది. బాబర్ ఆజమ్ సారథ్యంలోని ఆ దేశ జాతీయ జట్టుతో వన్డే ఇంటర్నేషనల్స్ టీ20 ఇంటర్నేషనల్స్‌ను ఆడుతుంది. ఈ నెల 13వ తేదీన ఈ సిరీస్ ఆరంభమౌతుంది. 22వ తేదీ నాటికి ముగిసిపోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ముగిసిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు సభ్యుల్లో కొందరిని తప్పించింది.

 రెండు ఫార్మట్లకూ..

రెండు ఫార్మట్లకూ..

వెస్టిండీస్‌ వీరులను ఢీ కొట్టే జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్‌కు వేర్వేరు టీమ్‌లను ఆడించనుంది. ఊహించినట్టే- ఈ రెండు ఫార్మట్లకు కూడా బాబర్ ఆజమ్ సారథ్యాన్ని వహిస్తాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌లో పర్యటించి వచ్చిన జట్టుతో పోల్చుకుంటే.. భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. హసన్ అలీ, ఇమద్ వసీం, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మలిక్‌కు జట్టులో చోటు దక్కలేదు.

 టీ20 ఇంటర్నేషనల్స్ కోసం..

టీ20 ఇంటర్నేషనల్స్ కోసం..

వెస్టిండీస్‌ను ఢీ కొట్టే టీ20 జట్టు: బాబర్ ఆజమ్ (కేప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కేప్టెన్), ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ హస్నయిన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వార్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, షహెన్ షా అఫ్రిది, షానవాజ్ దహని, ఉస్మాన్ ఖదిర్.

వన్డే ఇంటర్నేషనల్స్ కోసం..

వన్డే ఇంటర్నేషనల్స్ కోసం..

వన్డే ఇంటర్నేషనల్స్ జట్టు: బాబర్ ఆజమ్ (కేప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కేప్టెన్), ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ హస్నయిన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వార్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, షహెన్ షా అఫ్రిది, షానవాజ్ దహని, ఉస్మాన్ ఖదిర్.

Story first published: Thursday, December 2, 2021, 19:36 [IST]
Other articles published on Dec 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+