మూడేళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన పాకిస్థాన్ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైంది. ఆసీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు, మూడు టీ20ల సిరీస్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం జట్టును ప్రకటించింది. అయితే కెప్టెన్ లేకుండానే జట్టు వివరాలు వెల్లడించింది. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు జింబాబ్వే పర్యటనకు జట్టును ప్రకటించింది. దానిలోనూ సారథి వివరాలు చెప్పలేదు.
వన్డే, టీ20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ అజామ్ ఇటీవల తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు జట్టులో చోటు కోల్పోయిన బాబార్ అజామ్, షాహిన్ అఫ్రిది, నసీమ్ షా తిరిగి స్థానం దక్కించుకున్నారు. అయితే ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికైన వాళ్లు జింబాబ్వే పర్యటనలోని వన్డే, టీ20 సిరీస్‌లకు చోదు దక్కించుకోలేదు. అయితే తమ కెప్టెన్‌ను లాహోర్‌లో మీడియా సమావేశంలో పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నక్వీ ఇవాళ ప్రకటించనున్నాడు.

వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. జింబాబ్వేతో టీ20 సిరీస్ మినహా మిగిలిన సిరీస్‌లకు అతను ఎంపికయ్యాడు. రిజ్వాన్‌తో పాటు సల్మాన్ అఘా కూడా కెప్టెన్ రేసులో ఉన్నాడు. సల్మాన్ ఆసీస్‌తో పాటు జింబాబ్వే పర్యటనలో అన్ని సిరీస్‌లకు ఎంపికయ్యాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఫకర్ జమాన్, ఇమాముల్ హక్ జట్టులో చోటు కోల్పోయారు.
నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో వన్డే సిరీస్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మెగాటోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. 1996 వన్డే వరల్డ్ కప్ అనంతరం పాక్ ఆతిథ్యం ఇస్తున్న తొలి ఐసీసీ మెగాటోర్నీ ఇదే.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన పాకిస్థాన్ జట్టు:
అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ అజామ్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయుబ్, సల్మాన్ అఘా, షాహిన్ ఆఫ్రిది
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన పాకిస్థాన్ జట్టు:
అరాఫత్ మిన్హాస్, బాబర్ అజామ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అగ్హా, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా, మొకిమ్, ఉస్మాన్ ఖాన్.