Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్, చెత్త ఫీల్డింగ్.. ఓ ఎమోషన్ (వీడియో)

పాకిస్థాన్ జట్టులా మరే టీమ్ ఫీల్డింగ్ చేయలేదు. అంత గొప్పగా కాదు, చెత్తగా! బంతి గాల్లోకి లేచినప్పుడు ఇద్దరు ఆటగాళ్లు పోటాపోటీగా దగ్గరకు రావడం, తర్వాత దాని కోసం ఇద్దరూ కనీస ప్రయత్నం చేయకుండా నిలబడటం.. పాక్ జట్టుకే చెల్లుతుంది. అంతేగాక చాలా సులువైన క్యాచ్‌ను కూడా ఈజీగా జారవిడుస్తుంటారు. ఇలా జరగడం పాక్ కొత్తేమి కాదు, తరాల నుంచి ఆనవాయితీగా ఆచరిస్తుంటారు.

తాజాగా ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఓ సింపుల్ క్యాచ్‌ను జారవిడిచిన పాకిస్థాన్ మరోసారి నెట్టింట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. మూడు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ తొలి మ్యాచ్‌లో ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఇవాళ నుంచి రెండో టెస్టు ప్రారంభమైంది. అయితే డేవిడ్ వార్నర్‌ను ఆదిలోనే ఔట్ చేసే అవకాశాన్ని చెత్త ఫీల్డింగ్‌తో చేజార్చుకుంది.

Pakistan and its worst fielding is an emotion. VIDEO goes viral

మూడో ఓవర్‌‌లో షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో వార్నర్ డిఫెండ్‌కు ప్రయత్నించాడు. అది ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో ఉన్న అబ్దుల్లా షఫీకి చేతుల్లో నేరుగా పడింది. కానీ ఆ సులువైన క్యాచ్‌ను షఫికి అందుకోలేకపోయాడు. తొలుత షాక్ అయిన అఫ్రిది ఆ తర్వాత అసంతృప్తిగా తిరిగి బౌలింగ్ చేయడానికి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అయితే ఆరు పరుగుల వద్ద లైఫ్ లభించిన డేవిడ్ వార్నర్ 38 పరుగుల వద్ద ఔటయ్యాడు. సల్మాన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన వార్నర్ బాబర్ అజామ్ చేతికి చిక్కాడు. కాగా, లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 114 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత వరుణుడి ఎంట్రీ ఇచ్చాడు. కాసేపటికీ వర్షం పడటం ఆగిపోయినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ప్రస్తుతం ఆటను నిలిపివేశారు.

Story first published: Tuesday, December 26, 2023, 11:19 [IST]
Other articles published on Dec 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+