Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్‌లో ఫేవరేట్‌లుగా భారత్, పాక్‌లు: లంక మాజీ కెప్టెన్

Pakistan always have the X-factor: Mahela Jayawardena

హైదరాబాద్: ఆసియా కప్ 2018లో భాగంగా బరిలోకి దిగేందుకు భారత్.. పాక్ జట్లు ఫేవరేట్‌గా కనిపిస్తున్నాయంటున్నాడు శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ మహేలా జయవర్దనె. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో తొలి రోజు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2008లో పాకిస్తాన్ వేదికగా 50ఓవర్లు ఫార్మాట్‌లో భారత్‌ను ఓడించి శ్రీలంక గెలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగుతోన్న టీమిండియా బలహీనంగా ఏం లేదని అంటున్నాడు జయవర్దనె. అదే సందర్భంలో పాకిస్తాన్ జట్టును పనిలో పనిగా పొగిడేస్తున్నాడు. టోర్నీ మొత్తంలో భారత్‌కు గట్టి పోటీనిచ్చేందుకు పాకిస్తాన్ సర్ఫరాజ్ కెప్టెన్సీలో బలంగా కనిపిస్తుందని తెలిపాడు.

పాకిస్తాన్ జట్టుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మైదానంలో ఆడిన చాలానే ఉందనే సంగతి గుర్తు చేశాడు. వారికి దుబాయ్ మైదానాలో రెండో హోం గ్రౌండ్‌లు వంటివని తెలిపాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్‌పైనా చాలా నమ్మకంతో ఉంది. లీగ్‌లో భారత్-పాక్‌లు ఫైనల్ వరకూ వెళితే మాత్రం అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నమోదు అయిన ఫలితాలు దాదాపు చూడొచ్చు.

ప్రస్తుత ఆసియా కప్ టోర్నీలో గ్రూప్ ఏ విభాగంలో భారత్.. పాక్‌లతో పాటు హాంగ్ కాంగ్‌లు బరిలోకి దిగనున్నాయి. ఈ గ్రూప్ ఏ మ్యాచ్‌లు సెప్టెంబర్ 18 నుంచి జరగనుండటంతో భారత్.. తొలి మ్యాచ్‌ను హాంగ్ కాంగ్‌తో సెప్టెంబర్ 18న రెండో మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఆడనుంది. భారత్‌తో పాకిస్తాన్ తలపడిన మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Story first published: Sunday, September 16, 2018, 15:16 [IST]
Other articles published on Sep 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+