మిస్బా సెంచరీ: పాక్ 537/10
బెంగుళూర్: భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో పాకిస్తాన్ 537 పరుగులకు అలవుట్ అయింది. మిస్బావుల్ హక్ ను మాత్రం భారత బౌలర్లు అవుట్ చేయలేకపోయారు. మిస్బా 133 పరుగులతో నాటవుట్ గా మిగిలాడు. మరోసారి మిస్బా అక్మల్, ఆరాఫత్ లతో కలిసి పాకిస్తాన్ ను అదుకున్నాడు. అరాఫత్ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. సోమవారం ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 369 పరుగులు చేసిన పాక్ 537 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీసుకున్నాడు.
అక్మల్ మిస్బాతో కలిసి చక్కని ఆటతీరును ప్రదర్సించాడు. అక్మల్ 65 పరుగులు చేశాడు. సమీ, అక్తర్ ఒక్కటేసి పరుగు చేశారు. కనేరియా 4 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. హర్బజన్ కు రెండు వికెట్లు లభించగా, ఇర్ఫాన్ పఠాన్, గంగూలీ, కుంబ్లేలకు ఒక్కటేసి వికెట్లు లభించాయి. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్సులో డబుల్ సెంచరీ సాధించిన సౌరవ్ గంగూలీ (239, 30 ఫోర్లు, 2 సిక్స్‌లు)కి తోడు యువరాజ్ సింగ్ (169, 28 ఫోర్లు, 1 సిక్స్), చివర్లో వచ్చిన పఠాన్ (102, 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా పాక్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 626 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బౌలర్లలో అరాఫత్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మిగిలిన వారిలో డానిష్ కనేరియా మూడు, సమీ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
Story first published: Tuesday, December 11, 2007, 23:53 [IST]
Other articles published on Dec 11, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications