Video: ట్రై-సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఓటమి అనంతరం పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఫహామ్ అష్రఫ్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు జట్టులో లేకపోవడం వల్ల వారి లోటు కనిపిస్తోందా అని అడిగినప్పుడు.. అతను సరదాగా సమాధానం ఇచ్చాడు. అతని సమాధానానికి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నవారంతా నవ్వుకున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ టీమ్ యూఏఈలో ట్రై సిరీస్ ఆడుతోంది. ఇందులో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ జట్లు పాల్గొంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఫహీమ్ అష్రఫ్‌ను ఈ ఓటమికి కారణం.. అలాగే బాబర్, రిజ్వాన్‌లు లేకపోవడంపై ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఫహీమ్ అష్రఫ్ మాట్లాడుతూ.. "మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంత స్కోర్ కావాలి. ఎన్ని బంతులున్నాయనేదే గుర్తుంటుంది. మ్యాచ్ అయ్యాక మాకు ఇంట్లో వాళ్లు కూడా గుర్తుకువస్తారు. కానీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వాళ్లు కూడా గుర్తుకురారు. అలాంటిది మీరు మా సహచరుల గురించి అడుగుతున్నారు." అని బదులిచ్చారు. ఆటలో ఉన్నప్పుడు పాకిస్థాన్‌ను ఎలా గెలిపించాలనే ఆలోచనే ఉంటుందని చెప్పారు.
బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో వారి ఇటీవల పేలవమైన ఫామ్ కారణంగా ట్రై-సిరీస్, త్వరలో జరగబోయే ఆసియా కప్ జట్ల నుంచి కూడా తొలగించారు. వీరి ఇద్దరూ చివరిసారిగా డిసెంబర్ 2024లో దక్షిణాఫ్రికాలో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. వీరికి బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా చోటు లభించలేదు. దీనితో సెలెక్టర్లు వీరికి టీ20 జట్టులో స్థానం లేదనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో గురువారం తలపడనుంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్ 31 పరుగుల తేడాతో యూఏఈని ఓడించింది.