For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్తాన్‌కు జీవన్మరణ సమస్య - తుదిజట్టు అంచనాలివే..!!

PAK vs ZIM: Pakistan Playing 11 against Zimbabwe in T20 World Cup 2022

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్ రెండో మ్యాచ్ ఆడబోతోంది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. పెర్త్ స్టేడియంలో దీనికి వేదిక. జింబాబ్వేను ఢీకొట్టబోతోంది బాబర్ ఆజమ్ సేన. ఈ నెల 23వ తేదీన మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత- ఇక జింబాబ్వేను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది.

పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ కీలకం. ఇందులో గెలవాల్సిన అవసరమూ ఆ జట్టుకు ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో.. ఏ మ్యాచ్ రద్దవుతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నందున నెట్ రన్‌రేట్‌ను భారీగా పెంచుకోవాలని భావిస్తోంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి అంచుల్లో ఉన్న జింబాబ్వేను ఈ వర్షమే ఒడ్డున పడేసిన విషయం తెలిసిందే. ఫలితంగా- దక్షిణాఫ్రికాతో కలిసి పాయింట్లను పంచుకుంది. దీనితో పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ కంటే ఒక మెట్టుపైనే ఉంది జింబాబ్వే.

జింబాబ్వేతో పోల్చుకుంటే- పాకిస్తాన్ బలమైన జట్టే అయినప్పటికీ.. నిలకడ లేమి వెంటాడుతోంది. కేప్టెన్ బాబర్ ఆజమ్ విఫలమౌతోన్నాడు. బ్యాటింగ్ భారాన్ని ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, హైదర్ అలీ మోస్తోన్నారు. ఈ నలుగురు కూడా నిలకడగా ఆడట్లేదు. భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్ అర్ధసెంచరీలతో రాణించారు. వారిద్దరూ లేకపోతే- పాక్ జట్టు పరిస్థితి మరింత దయనీయంగా తయారై ఉండేది.

పాకిస్తాన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బలంగా ఉంది. టీమిండియాను 31 పరుగులకు నాలుగు వికెట్లను పడగొట్టారు బౌలర్లు. షహీన్ షా అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్‌‌తో కూడిన బౌలింగ్ విభాగం- జింబాబ్వే కంటే స్ట్రాంగ్. జింబాబ్వే జట్టును కూడా ఏ మాత్రం తీసిపారేయలేం. సికిందర్ రజా, కేప్టెన్ క్రెయిగ్ ఇర్విన్, రెజిస్ చకబ్వా, సీన్ విలియమ్స్, వెస్లీ మధెవెరె.. ఎలాంటి బౌలర్లనయినా ఎదుర్కొనగలరు. బౌలర్ రిచర్డ్ ఎన్‌గర్వ గాయపడటం మైనస్ పాయింట్.

పాకిస్తాన్ తుదిజట్టులో- బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హ్యరీస్ రవూఫ్, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా ఆడే అవకాశాలు ఉన్నాయి. జింబాబ్వే జట్టులో- క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా (వికెట్ కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, వెస్లీ మాధేవెరే, మిల్టన్ షుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, 9 రిచర్డ్ ఎన్‌గర్వ/బ్రాడ్ ఇవాన్స్, తెందై ఛతారా, బ్లెస్సింగ్ ముజరబానీ ఆడొచ్చు.

Story first published: Wednesday, October 26, 2022, 21:48 [IST]
Other articles published on Oct 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+