For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్తాన్-జింబాబ్వే మ్యాచ్‌లో ఫేక్ కలకలం - పాక్ గాలి తీసిన జింబాబ్వే అధ్యక్షుడు..!!

 PAK vs ZIM: Next time, send the real Mr Bean, Zimbabwe President Emmerson Dambudzo reacts.

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో చిన్న జట్లు పంజా విసురుతున్నాయి. మొన్నటికి మొన్న ఐర్లాండ్- తన కంటే ఎంతబలమైన ఇంగ్లాండ్‌ను ఓడించింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలోనే అయినప్పటికీ- వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి.. ఆ లక్ష్యానికి ఆమడదూరంలో ఇంగ్లాండ్‌ను ఉంచగలిగింది ఐర్లాండ్. వీటి దెబ్బకు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా గుర్తాంపు ఉన్న వెస్టిండీస్ కనీసం సూపర్ 12లో అడుగు కూడా పెట్టలేకపోయింది.

జింబాబ్వే దెబ్బకు..

అక్కడితోనే వాటికి బ్రేక్ పడలేదు. పాకిస్తాన్ సైతం ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. జింబాబ్వే చేతిలో మట్టి కరిచింది. ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దాన్ని ఛేదించలేక చతికిల పడింది పాకిస్తాన్. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా రెండింటితోనే సరిపెట్టుకుంది. ఆల్‌రౌండర్ సికిందర్ రజా పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

పెను సంచలనం..

పాకిస్తాన్‌పై జింబాబ్వే సాధించిన ఈ విజయం క్రికెట్ ప్రపంచంలో పెనుసంచలనంగా మారింది. గతంలో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అప్పట్లో టైటిల్ హాట్ ఫేవరెట్ వెస్టిండీస్‌ను ఓడించిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. 130 పరుగులను కాపాడుకోవడంలో జింబాబ్వే ప్లేయర్లు చూపించిన తెగువను ప్రశంసించకుండా ఉండలేకపోతోన్నారందరూ. ఓడింది పాకిస్తాన్ కావడంతో ఇటు భారత్‌లోనూ సెలబ్రేషన్స్ మిన్నంటాయి. జింబాబ్వే జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్.

ఫేక్ మిస్టర్ బీన్

ఈ మ్యాచ్ అనంతరం టాప్ కమేడియన్ మిస్టర్ బీన్ అలియాస్ రొవాన్ అట్కిన్సన్ పేరుతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. మిస్టర్ బీన్ పదాన్ని స్వయంగా జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ఎంనంగగ్వా సైతం ఉపయోగించాల్సి వచ్చిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం లేకపోలేదు.

రోడ్‌షోలో..

2016లో జింబాబ్వే రాజధాని హారారెలోని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో నిర్వహించిన ఓ కామెడీ షో సందర్భంగా ఆ దేశ ప్రజలను అవమానపరిచింది పాకిస్తాన్. హరారె రోడ్‌షోలో మిస్టర్ బీన్ అలియాస్ రొమన్ అట్కిన్సన్‌కు బదులుగా ఆయన రూపాన్ని పోలిన పాకిస్తాన్ కమేడియన్ ఆసిఫ్ మహ్మద్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతణ్నే రియల్ మిస్టర్ బీన్ అనుకున్నారు జింబాబ్వే ప్రజలు. అతనితో చేతులు కలపడానికి, ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. దీనికోసం 10 డాలర్లను చెల్లించారు. ఆ తరువాత నిజం తెలిసి లబోదిబోమన్నారు.

రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలంటూ..

ఇప్పుడు ఈ విజయంతో దీనికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టయింది జింబాబ్వేకు. నెక్స్ట్ టైమ్‌ రియల్ మిస్టర్ బీన్‌ను పంపించాలంటూ జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌కు చురకలు అంటించారు. తమదేశం సాధించిన విజయం పట్ల ఆయన స్పందించారు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలోని జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. కంగ్రాట్యులేషన్స్ టు చెవ్రాన్స్ అంటూ ట్వీట్ చేశారు.

Story first published: Friday, October 28, 2022, 7:11 [IST]
Other articles published on Oct 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+