పాకిస్థాన్ స్పిన్నర్ ఆల్ టైమ్ రికార్డ్ - 1952 తర్వాత ఇదే తొలిసారి
పాకిస్థాన్ స్పిన్నర్ నొమన్ అలీ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ హిస్టరీలో పాకిస్థాన్ తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్ గా రికార్డు కెక్కాడు. వెస్టిండీస్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో ఈ ఘనత సాధించాడు. జస్టిన్ గ్రీవ్స్, టెల్విన్ ఇమ్లాచ్, కెవిన్ సీన్ క్లెయిర్ వికెట్లను వరుసగా 3 బంతుల్లో తీసి ఈ ఫీట్ నమోదు చేశాడు.
1952లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది పాకిస్థాన్. అయితే అప్పటి నుంచి ఆ జట్టులో కొంతమంది మాత్రమే మూడు వరుస బంతుల్లో వికెట్లు తీశారు. కానీ, ఓ స్నిన్నర్ ఇలాంటి ఘనత సాధించలేదు. నొమన్ అలీనే తొలి స్పిన్నర్ కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో పాక్ బౌలర్‌గా ఘనత సాధించాడు నొమన్. నొమన్ కన్నా ముందు వసీం అక్రం, అబ్దుల్ రజాక్, మొహ్మద్ సమీ, నసీం షా ఈ ఫీట్ ను టచ్ చేశారు. వీళ్లంతా స్పిన్నర్లు కాదు.

ముల్తాన్ వేదికగా శనివారం రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే, పాకిస్థాన్ స్పిన్నర్లు మొదటి నుంచే విండీస్ బ్యాటర్లకు చెమటలు పట్టించారు. ఓపెనర్ మికైల్ లూయిస్(4)ను కశిఫ్ అలీ ఔట్ చేయగా, వన్‌డౌన్ బ్యాటర్ ఆమిర్ జాంగూ(0)ను రెండో వికెట్‌గా వెనక్కి పంపాడు.
ఈ క్రమంలో పదో ఓవర్‌లో తన వికెట్ల వేట మొదలుపెట్టాడు నొమన్ అలీ. మొదట అతడి బౌలింగ్ లో కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్(9) లబీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వెస్టిండీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతి నుంచి వరుస బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్(1), టెల్విన్ ఇమ్లాచ్(0), కెవిన్ సిన్‌క్లెయిర్(0)లను ఔట్ చేశాడు. అలా వరుసగా 3 బంతుల్లో హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి రికార్డు కెక్కాడు. పాకిస్థాన్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి స్పిన్నర్‌గా నిలిచాడు. మొత్తంగా పాకిస్థాన్ బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌట్ అయింది.
పాకిస్థాన్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్లు
వసీం అక్రం- 1999లో లాహోర్ వేదికగా శ్రీలంకపై
వసీం అక్రం- 1999లో ఢాకా వేదికగా శ్రీలంకపై
అబ్దుల్ రజాక్- 2000లో గాలే వేదికగా శ్రీలంకపై
నసీం షా- 2020లో రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌పై
నొమన్ అలీ- 2025లో ముల్తాన్ వేదికగా వెస్టిండీస్
అంతకుముందు ఇరు జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జనవరి 17- 21 వరకు జరిగిన మొదటి టెస్టులో ఆతిథ్య పాక్ ఘన విజయం సాధించింది. విండీస్‌ను ఏకంగా 127 పరుగుల తేడాతో ఓడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications