న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs SL: కాశ్మీర్‌ను మరిచిపోయేలా చేసిన కరాచి.. శ్రీలంక భద్రతపై గంభీర్ వ్యంగం

PAK vs SL: Gautam Gambhir mocked Pakistans security arrangements over Sri Lankan Series

ఢిల్లీ: పాకిస్థాన్ గడ్డపై మ్యాచ్‌లు నిర్వహించాలనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కల ఎట్టకేలకు నెరవేరింది. పదేళ్ల తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై శ్రీలంక పర్యటిస్తోంది. భద్రత కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో పర్యటించమని మొదటగా లంక బోర్డు తెలిపినప్పటికీ.. పటిష్ట భద్రత కలిపిస్తామని పాక్ హామీ ఇవ్వడంతో లంక ఆటగాళ్లు వచ్చారు. అయితే సొంతగడ్డపై మ్యాచ్‌లు నిర్వహించేందుకు పాకిస్థాన్ గట్టి బందోబస్తునే ఏర్పాటు చేసింది.

కపిల్‌దేవ్‌ సంచలన నిర్ణయం.. సీఏసీ పదవికి రాజీనామా!!కపిల్‌దేవ్‌ సంచలన నిర్ణయం.. సీఏసీ పదవికి రాజీనామా!!

మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటం కోసం పాక్ పర్యటనకు శ్రీలంక క్రికెటర్లు వచ్చారు. సోమవారం రెండో వన్డే సందర్భంగా ఇరుదేశ క్రికెటర్లకు ఆ దేశ ప్రెసిడెంట్ తరహా సెక్యూరిటీని అందించారు. లంక ఆటగాళ్లను వారు బస చేస్తున్న హోటల్‌ నుంచి స్టేడియానికి తీసుకెళ్లేందుకు భారీ భద్రత కల్పించారు. పెద్ద సంఖ్యలో కాన్వాయ్ ఏర్పాటు చేసి లంక ఆటగాళ్ల వాహనాలను జాగ్రత్తగా తీసుకెళ్లారు. కాన్వాయ్‌లో 42 ఆర్మీ వాహనాలతో ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియానికి వెళ్లారు.

కాన్వాయ్ స్టేడియానికి వెళ్తోన్న దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆటగాళ్లకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ కల్పించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేల్చుతున్నారు. ఈ వీడియోను టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. 'కాశ్మీర్‌ను మరిచిపోయేలా చేసిన కరాచి' అని రాసుకొచ్చాడు. గంభీర్ పోస్ట్ చేసిన వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

మానవతను చాటుకున్న గంభీర్.. మహిళ అభ్యర్థి ట్వీట్‌కు స్పందన!!మానవతను చాటుకున్న గంభీర్.. మహిళ అభ్యర్థి ట్వీట్‌కు స్పందన!!

మూడు వన్డేల సిరిస్‌లో తొలి వన్డే వర్షం కాగా రద్దు కాగా.. సోమవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ 67 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (115) సెంచరీ, ఫకర్‌ జమన్‌ (54) హాఫ్ సెంచరీతో రాణించారు. అనంతరం 306 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 46.5 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌటైంది. షెహన్‌ జయసూర్య (96) సెంచరీ సాధించాడు. ఈ సిరిస్‌లో చివరిదైన ఆఖరి వన్డే బుధవారం జరగనుంది.

Story first published: Wednesday, October 2, 2019, 14:26 [IST]
Other articles published on Oct 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X